ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక కొంత కాలం క్రితం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 మూవీ ని రూపొందించారు. ఈ సినిమా ఈ రోజు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయింది.

ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ తన కెరియర్ ప్రారంభం నుండి దాదాపు పుష్ప పార్ట్ 1 మూవీ విడుదల వరకు కూడా ఎక్కువ శాతం మెగా హీరో వాళ్ళ ప్రస్తావన తెరపైకి తెస్తూ ఉండేవాడు. తన సినిమాలకు సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా కూడా మరి ముఖ్యంగా చిరంజీవి ప్రస్తావన తెచ్చి ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇక కొంత కాలం క్రితం అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వైసీపీ కార్యకర్తకు సపోర్ట్ చేస్తూ నంద్యాలకు వెళ్లి మరి అక్కడి వైసిపి పార్టీ అభ్యర్థిని గెలిపించాలి అని కోరాడు. దానితో ఒక్క సారిగా జనసేన కార్యకర్తలు , పవన్ అభిమానులు ఆయనపై ఫైర్ అయ్యారు. ఇక అప్పటినుండి అల్లు అర్జున్ కూడా ఎక్కువగా మెగా హీరోల ప్రస్తావన తేవడం లేదు. ఆయన తన సొంత ఇమేజ్ తోనే ఎదగాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

అందుకు తగినట్లుగానే ఈయన కూడా ఎక్కువ శాతం తన సినిమా ఈవెంట్లలో మెగా హీరోలా ప్రస్తావనేను తీసుకురాలేదు. ఇక తాజాగా విడుదల అయిన పుష్ప పార్ట్ 2 మూవీ కి మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా వచ్చి తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు అని అల్లు అర్జున్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa