గత కొన్ని రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో మెగా - అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వార్ నడుస్తూనే ఉంది.. ఈ వార్ పుష్ప సినిమా రిలీజ్ సమయంలో కూడా మొదలైంది.. ముఖ్యంగా ఈ చిత్రంలో డైలాగులు, రిలీజ్ ముందు చేసిన అన్ని అంశాలు కూడా చూస్తే.. కచ్చితంగా మెగా అభిమానులు హర్ట్ అయ్యే విధంగా ఉంటాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయితే గతంలో అల్లు అర్జున్ సినిమాల మీద ట్రోల్ చేసినప్పటికీ.. పుష్ప సినిమాతో అందరికీ ఇచ్చుపడేసినట్లు అభిమానులు తెలియజేస్తున్నారు.



సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం అండ లేకపోతే అల్లు అర్జున్ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సినిమాలు కూడా ఆడవని మెగా అభిమానులు లేకపోతే అల్లు అర్జున్ చిత్రాలకు కలెక్షన్స్ రావడం కూడా కష్టమే అన్నట్లుగా చాలామంది మాట్లాడారు. కానీ ఈరోజు విడుదలైన పుష్ప-2 చిత్రం అందరి అంచనాలను సైతం మించిపోయి మరి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. ముఖ్యంగా అల్లు అర్జున్ మొదటి నుంచి ఈ సినిమా మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారు ఆ నమ్మకం వోమ్ము కాలేదు.. ఇక అభిమానులు కూడా ఈ సినిమా చూసిన తర్వాత.. ఎవరి అండ లేకుండా సింగిల్ గా వచ్చి లెజెండ్రీ గా మారారని దెబ్బకి ట్రోల్ చేసే పిట్టలన్ని కూడా అవుట్ అయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు.


ఏది ఏమైనా తన సొంత బ్రాండ్ తోనే అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాని సక్సెస్ బాట పయనిస్తున్నారు.. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏవిధంగా ఉంటాయో చూడాలి మరి.. విడుదలైన అన్ని భాషలలో అన్ని ఏరియాలలో కూడా పుష్ప-2 చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప-2 చిత్రం సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు.. మరొకసారి అల్లు అర్జున్ తెలుగు సినిమా పరిశ్రమ ఇతర భాషలలో కూడా  మాట్లాడుకునేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: