నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక బాలకృష్ణ రీసెంట్గా భగవాన్ కేసరి మూవీలో నటించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత 109 మూవీలో నటించబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 109 చిత్రం 'డాకు మహారాజ్' తో బిజీగా ఉన్నాడు.

 బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబి కొల్లి తనకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇదిలా ఉంటే... ఇప్పుడు బాలకృష్ణ డైరెక్షన్లో తన వారసుడు మోక్షజ్ఞ సినిమా రాబోతున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. బాలకృష్ణ హీరోగా 1991 న వచ్చినా చిత్రం 'ఆదిత్య 369' ఈ సినిమాకి సంగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించిన ఈ మూవీ టైం ట్రావల్ కథంశంతో రూపొంది అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో పాటలకు ఈ తరం కూడా కనెక్ట్ అవుతున్నారు. ఆనడంలో అతిశయోక్తి లేదు.

ఇందులో శ్రీకృష్ణదేవరాయ లుగా బాలకృష్ణ పాత్ర ఎవర్ గ్రీన్ గా నిలిచింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. అయితే... ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ' ఆదిత్య 999' అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం స్క్రిప్ట్ పనుల్లో బాలయ్య నిమగ్నమై ఉన్నారని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఇంకో విషయం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని బాలయ్య బాబే దర్శకత్వం వహిస్తుండగా... ఇందులో మోక్షజ్ఞ హీరోగా నటించినట్లు టాక్.. అయితే... బాలకృష్ణ హోస్ట్ గాచేస్తున్న అన్ స్టాపబుల్ షోలో 'ఆయన ఆదిత్య 369 గెటప్ లో కనిపించడమే ఇప్పుడు ఈ వార్తలు వైరల్ అయ్యేందుకు ప్రధాన కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: