అయితే ఇలాంటి హిట్ మూవీకి సీక్వెల్ వస్తుంది అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇలాంటి భారీ అంచనాల మధ్య పుష్ప-2 మూవీ నేడు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. దాదాపు 50 దేశాలలో 11500 కు పైగా థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఇక భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటిలాగానే ఊహించని రీతిలో బజ్ ఏర్పడింది. ఇక భారీగా వసూళ్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అన్నది తెలుస్తుంది. కానీ ఒక విషయం గమనిస్తే మాత్రం డైరెక్టర్ సుకుమార్ థియేటర్కు వెళ్లిన ప్రేక్షకులందరిని పిచ్చోళ్లను చేసేసాడు అన్న విషయం అర్థమవుతుంది.
ఎందుకంటే ఇప్పటివరకు పుష్ప పార్ట్ 2 కి సంబంధించి అటు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ పలు టీజర్లను విడుదల చేశారు. అయితే మొదట విడుదల చేసిన టీజర్ అభిమానులు అంచనాలను పెంచేసింది. అయితే ఈ టీజర్ లో ఉన్నది మాత్రం సినిమాలో కనిపించలేదు. ఇంతకీ టీజర్ లో ఏముందంటే సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ చనిపోతాడని.. ఏకంగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతాడని.. అతని కోసం ప్రజలందరూ ధర్నా చేస్తారని.. అతనికి ఎనిమిది బుల్లెట్ గాయాలు తగులుతాయని.. చివరికి ఓ రోజు పులుల కోసం అడవిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో అటు పుష్పరాజ్ ఆచూకీ లభిస్తుంది అనేది టీజర్ లో చూపించారు. ఇక ఈ టీజర్ చూసి సినిమా ఏ లెవెల్ లో ఉంటుందో అని అభిమానులు అనుకున్నారు. తీరా థియేటర్కు వెళ్లాక టీజర్ లో చూపించిన ఒక్క సీన్ కూడా సినిమాలో లేదు. దానికి తోడు ఇక టీజర్ కి అసలు సినిమాకి సంబంధమే లేదు. దీంతో ఇక ఈ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు సుకుమార్ ప్రేక్షకులను పిచ్చోళ్ళను చేశాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ టీజర్ ఏంటో మీరు కూడా చూసేయండి.