పుష్ప -2 సినిమా నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.. భారీ బడ్జెట్ సినిమా కావడం చేత పుష్ప-2 చిత్రంతో స్టార్ హీరోల రికార్డులన్నీ కూడా తిరగరాస్తారనే నమ్మకాన్ని అటు అభిమానులను ప్రేక్షకులలో కూడా ఉన్నది.. ముఖ్యంగా బాలీవుడ్లో పుష్ప-2 విపరీతంగా కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  హిందీలో కలెక్షన్స్ తోనే ఒక చరిత్ర సృష్టించిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.



నిన్నటి రోజున విడుదలైన పుష్ప-2 చిత్రం అక్కడ ఏకంగా రూ.67 కోట్ల  లోపు కలెక్షన్స్ సాధించిన మొదటి చిత్రంగా నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని బాలీవుడ్ సినీ విశ్లేషకులు వివరిస్తున్నారు. మరి కొంతమంది 70 కోట్ల మార్కును కూడా బాలీవుడ్ లో దాటి ఉండవచ్చు అని అంచనాన్ని కూడా వేయడం జరుగుతోంది.. ఒక తెలుగు సినిమా డబ్బింగ్ మూవీ అయ్యుండి హిందీలో అదరగొట్టడం అంటే అది ఆశ మాస విషయం కాదని పలువురు నెట్టిజెన్స్ కూడా తెలియజేస్తున్నారు. తెలుగు సినిమా బాలీవుడ్లో డామినేట్ చేస్తోందనే విధంగా బాలీవుడ్ విశ్లేషకులు తెలియజేస్తున్నారు..


ఒకవేళ రూ .70 కోట్ల మార్కు దాటి ఉంటే కచ్చితంగా ఇది ఒక సరికొత్త చరిత్ర తెలుగు సినిమా నుంచి అంటూ పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు.. మరి మొత్తానికి ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఏ విధంగా రా పట్టిందో తెలియాలి అంటే మరొక కొన్ని గంటలు సమయం ఉండాల్సిందే.. పుష్ప-3 రాంపేజ్ అనే పేరుతో ఉండబోతున్నట్లు పుష్ప-2 చివరిలో చూపిస్తారు ఎవరు గుర్తు తెలియని వ్యక్తి పుష్ప ఇంటిని బ్లాస్ట్ చేసేలా చూపించడం జరిగింది.. మరి మొత్తానికి పుష్ప -3 అనేది ఎప్పుడు తీస్తారు చూడాలి మరి. ప్రస్తుతమైతే బాలీవుడ్లో పుష్ప-2 మానియో మరొకసారి వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: