పుష్ప మొదటి భాగం సక్సెస్ కావడంతో... రెండవ పార్ట్ పైన భారీగా అంచనాలు పెరిగాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు పుష్ప గాడి పార్ట్ 2 పాజిటివ్ టాక్ నుంచి హైయెస్ట్ కలెక్షన్ల వైపు దూసుకు వెళ్తోంది. ఒక్క రోజుకే 300 కోట్లు చేరే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సినిమా ఇంతటి సక్సెస్ అందుకోవడం వెనుక... టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందాన తో పాటు సుకుమార్ ఉన్నారు.
ఈ ముగ్గురి కలయికతోనే సినిమా బ్రహ్మాండమైన హిట్ అందుకుందని చెప్పవచ్చు. అయితే ఇలాంటి సినిమాలో.. ఆఫర్ వస్తే ఎవరు వదులుకోరు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ పుష్ప పార్ట్ నుంచి తప్పుకున్నారు. బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయారు. అది కూడా శ్రీ వల్లి పాత్ర. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందాన కంటే ముందు... మరో హీరోయిన్ ను... సెలెక్ట్ చేశారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు... సమంత అని సమాచారం.
రంగస్థలం హిట్ కావడంతో... మరోసారి సమంతను మొదట.. పుష్ప గాడి కోసం టచ్ చేశారట. కానీ అప్పటికే ఆమెకు బిజీ షెడ్యూల్ ఉండడంతో... పుష్ప సినిమాకు ఒప్పుకోలేదట సమంత.ఇక వెంటనే.. ఈ ప్రాజెక్టు రష్మిక మందాన కు వెళ్ళింది. ఈ సినిమా పడగానే రష్మిక మందాన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రపంచ స్థాయిలో శ్రీవల్లికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా ఎంత మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.