ఏ అబ్బాయి దగ్గరికి వెళ్లి అడిగిన సరే.. చీర కట్టుకోండి అంటే  బుసు బుసు అని ఉరిమి ఉరిమి చూస్తారు. చాలా చాలా కోపం వస్తుంది.. మండిపోతారు. ఆ కోపంలో కొందరు బూతులు కూడా తిడతారు . అలాంటిది ఒక స్టార్ హీరో వద్దకు వెళ్లి బన్ని నువ్వు ఈ సినిమాలో చీర కట్టుకోవాలి అంటే అది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది . పాన్ ఇండియా లాంటి హిట్ అందుకున్న బన్నీ చీర కట్టుకోవడం ఏంటి ..? అంటూ చాలామంది నవ్వుకుంటారు కూడా ..


అయితే బన్నీ కూడా మొదటగా అలాగే షాక్ అహ్య్యాడట. "ఏంటి సుక్కు ఏం మాట్లాడుతున్నావ్..?" అంటూ చాలా చాలా ఫైర్ అయిపోయారట.  కానీ సుకుమార్ చెప్పిన విధానం..సుకుమార్ చెప్పిన మాటలు బన్ని ని ఆలోజింప చేశాయట. బన్నీ కి ఒకే ఒక మాట చెప్పారట సుకుమార్.  నీకు మరొకసారి నేషనల్ అవార్డ్  రావాలి అంటే కచ్చితంగా నువ్వు నేను చెప్పినట్లే వినాలి ..అంటూ మొండి పట్టుదలగా బన్నీ చేత చీర కట్టించాడట.



బన్నీ చేత్ చీర కట్టించి మరి గంగమ్మ జాతర సీన్స్ ను హైలెట్ చేసే విధంగా చేశారట . బన్నీకి చీర కట్టడం అంత సులువు గా  కుదరలేదట. దాదాపు రెండు వారాలు పాటు బాగా కష్టపడ్డారట . రెండు సార్లు లుక్ టెస్ట్ లో ఫెయిల్ కూడా అయ్యారట.  ఫైనల్లీ మూడవసారి సక్సెస్ అయింది . ఇప్పుడు ఈ సినిమా హిట్ కి కారణమైంది . సూపర్ డూపర్ హిట్ అందుకుంది పుష్ప 2 సినిమా అంటే మెయిన్ దానికి కారణం గంగమ్మ జాతర ఎపిసోడ్ అనే చెప్పాలి . అల్లు అర్జున్ తన కెరీర్ లో మరొకసారి ఇలాంటి పాత్రలో కనిపించలేడేమో..? మొత్తానికి సుకుమార్ - అల్లు అర్జున్ లైఫ్ నే టర్న్ చేశారు . ఒకవేళ మళ్లీ ఫ్యూచర్లో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో సినిమాలు వచ్చిన ఇంత హిట్ అవుతుందని మాత్రం చెప్పలేమంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: