పుష్ప2 సినిమా అంటే మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది గంగమ్మ జాతర ఎపిసోడ్. సినిమా మొత్తానికి కర్త - కర్మ - క్రియ అంతా కూడా గంగమ్మ జాతర ఎపిసోడ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు పుష్ప 2 సినిమా చూసిన తర్వాత అందరూ కూడా బాహుబలి సినిమాలో లేనిది పుష్ప2 సినిమాలో ఉన్నది అదే అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు . కధ ఏమీ లేదు పుష్ప1 సినిమాకి కంటిన్యూవేషన్ కథ ఈ పుష్ప 2.
పుష్ప రాజ్ గాడు తన ఇంటి పేరు కోసం ఎంత పాకులాడుతున్నాడు. అందుకే కూతురు పుట్టాలి అని దేవుడికి కోరుకోవడం. అదేవిధంగా తన స్వాగ్లింగ్ బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేయడం లాంటివే చూపించాడు. కానీ ఇక్కడ సుకుమార్ నమ్ముకుంది ఒకే ఒక్కటి పుష్ప రాగ్ గాడినే. పుష్పరాజ్ క్యారెక్టర్ నమ్ముకున్న సుకుమార్ ఓ రేంజ్ లో విజృంభించే విధంగా అల్లేసుకున్నాడు. అయితే బాహుబలి సినిమాలో కథ ఉంది. రాజమౌళి ఆ విధంగా కధ రాసుకున్నాడు . కానీ పర్ఫామెన్స్ మాత్రం ప్రభాస్ అంత రేంజ్ లో ఇవ్వలేదని అంటున్నారు.. కంపేర్ టు బన్నీ. కానీ పుష్ప సినిమాలో మాత్రం అల్లు అర్జున్ చించేసాడు. అసలు కథ ఏమీ లేకపోయినా సరే పుష్పరాజ్ క్యారెక్టర్ పూనిన్నట్లు ఓ రేంజ్ లో అల్లాడించేశారు . ఇక పుష్ప2 సినిమా కథ కొంచెం కాని హైలెట్ అయి ఉంటే అసలు ఇక ఈ సినిమాలో వేలు పెట్టే ఛాన్స్ ఎవరికీ వచ్చుండేది కాదు. ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి..!