పుష్ప ది ర్యాంపేజ్ లో శ్రీవల్లి, కేశవ పాత్రలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. సుకుమార్ మనసులో ఏముందో పుష్ప ది రూల్ ను ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో తెలియాల్సి ఉంది. పుష్ప ది ర్యాంపేజ్ లో అసలు కథ ఉండబోతుందని షెకావత్, మంగళం శ్రీను, వీర ప్రతాపరెడ్డిలను బన్నీ ఎలా ఎదురించాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
అటు బన్నీ ఇటు సుకుమార్ తర్వాత సినిమాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించడం గమనార్హం. పుష్ప ది రూల్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్లకు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం బ్రహ్మరథం పడుతున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక సైతం తన ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను అలరించే విషయంలో సక్సెస్ అయ్యారు. పుష్ప ది రూల్ సినిమాకు సోమవారం నుంచి టికెట్ రేట్లను తగ్గించాలని మెజారిటీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. భారీ టికెట్ రేట్లు ఈ సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతున్నాయని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ మూవీ టికెట్లు బుక్ మై షోలో గంటకు 10000 కంటే ఎక్కువగా బుకింగ్ అవుతుండటం గమనార్హం. జాతర సీన్ మాత్రం సినిమాకు హైలెట్ అయింది.