అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమా వచ్చేసింది. ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది. ? బాలీవుడ్ లో ఎంత సాధిస్తుంది ? అనే లెక్కలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఈ వారం అంతా బాక్సాఫీస్ దగ్గర పుష్ప జాతర బ్రేక్ లేకుండా కొనసాగనుంది. అయితే ఇప్పుడు అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్న ఒకటి ఉంది. పుష్ప 3 సినిమా ఉంటుందా లేదా ? అని ఎందుకు అంటే పుష్ప 2 సినిమా చివర్లో పుష్ప 3 ఉంటుందంటూ చిత్ర బృందం ప్రకటించింది. పుష్ప వన్ ది రైజ్ - పుష్ప టు ది రూల్ .. అయితే పుష్ప 3 దీనిపై అన్నమాట, సుకుమార్ - మైత్రి మూవీ సంస్థలకు ఈ సినిమాకి పార్ట్ 3 తీసే ఆలోచన అయితే ఉంది. అయితే ఇప్పట్లో అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ప్రాజెక్ట్ చేయాలి. అందుకు కాస్త సమయం కొట్టే అవకాశం ఉంది.
2025 వేసవిలో ఈ సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది. చాలా పెద్ద కాన్వాస్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా పూర్తి అయ్యేటప్పటికి రెండు ఏళ్లు పట్టొచ్చు. ఆ తర్వాత బన్నీ పూర్తి చేయాల్సిన కమిట్మెంట్స్ ఉన్నాయి. అంటే కనీసం నాలుగేళ్ల వరకు పార్ట్ 3 పై ఫోకస్ చేయలేడు. మధ్యలో బన్నీ - రాజమౌళి సినిమా పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు పార్ట్ 2 లో సీఎం సీటు కోసం బన్నీ చేసిన రాజకీయం అనే కాన్సెప్టు లేకపోతే.. కథ లేదు. పార్ట్ 3 చేయాలంటే కొత్త కాన్సెప్టు కావాలి.. ప్రేక్షకులు ఇప్పటికే పుష్పరాజ్ అవతారం, అతని ప్రపంచాన్ని రెండుసార్లు చూసేయడంతో మూడో సారి కూడా దీని మీదే కథ రాయాలి.. కొనసాగించాలి అంటే చాలా కష్టం. అది సుకుమార్ కు రిస్కే అవుతుంది కూడా.. !