మొదటగా పాట్నా లో టీజర్ రిలీజ్ చేశారు . సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చెన్నైలో మ్యూజికల్ ఈవెంట్ పెట్టారు. అది కూడా బ్లాక్ బస్టర్ . ఆ తర్వాత మామూలుగా లేదు . ఆ తర్వాత ముంబైలో ప్రెస్ మీట్ ఓ రేంజ్ లో అల్లాడించేసారు రష్మిక - బన్నీ . ఫైనల్లీ హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇది కెవ్వు కేక అనే రేంజ్ లో హిట్ అయింది . ఇలా సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటూ ముందుకెళ్ళాడు.
అలా అలా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారిపోయింది. అయితే పుష్ప సినిమా హిట్ అవ్వడానికి ముఖ్యంగా ఈ మూడే కారణాలంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది బన్నీ నటన . ఈ సినిమాలో బన్నీ నటన నటించిన్నట్లు లేదు విజృంభించేశాడు. మరి ఏ నటుడు కూడా నటించలేడు అని చెప్పడంలో సందేహమే లేదు . అంతేకాదు డైరెక్షన్ డైరెక్షన్ లేకపోతే బన్నీ ఎంత నటించినా కూడా తెరపై జనాలు ఆకట్టుకునే విధంగా కనిపించదు. అంతేకాకుండా సినిమాటోగ్రఫీ . సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ కీలకంగా మారిందని చెప్పాలి. చాలా చాలా ప్లస్ గా మారింది. ఈ మూడు సినిమా హిట్ కి కారణమయ్యాయి అని ఒకవేళ ఈ మూడింట్లో ఏ ఒక్కటి ప్లాప్ అయినా కూడా పుష్ప ఈ రేంజ్ లో హిట్టు అందుకునేది కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం మరి పుష్ప2 ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో..??