ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా... తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. మెగా కుటుంబాన్ని ఆసరాగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్... ఇప్పుడు తనకంటూ ఒక ఐకాన్ స్టార్ అనే ముద్రను వేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే పుష్ప మొదటి భాగాన్ని సక్సెస్ చేసుకున్న అల్లు అర్జున్... తాజాగా రెండవ పార్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

బుధవారం రోజు రాత్రి నుంచి ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా...  మెజారిటీ థియేటర్లలో పుష్ప 2 సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు. మొదటి షో తోనే సక్సెస్ స్టాక్ రావడంతో ఈ సినిమా చూసి ఎందుకు జనాలు ఎగబడుతున్నారు. అసలు బుక్ మై షో... ఓపెన్ చేస్తే ఎప్పుడు కూడా టికెట్లు దొరకడం లేదు. క్షణాలలో టికెట్లు అయిపోతున్నాయి.

 అయితే ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన హీరో హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా... మొదటి రోజు కలెక్షన్ల పై అందరూ చర్చించుకుంటున్నారు. ఈ సినిమా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం హిందీలోనే మొదటి రోజు 65 నుంచి 70 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. గతంలో బాలీవుడ్ సినిమాలు కూడా... ఇంత రేంజ్ లో ఆడలేదట.

 డబ్బింగ్ సినిమా అయినప్పటికీ హిందీలో... పుష్ప మానియా కొనసాగుతోందట. ముఖ్యంగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో.. ప్రతి థియేటర్లో పుష్ప  2 సినిమా వేసినట్లు చెబుతున్నారు. కేరళ ఇటు తమిళనాడులో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఒక తెలుగోడి సత్తా ఏంటో  అనేది దేశవ్యాప్తంగా...చేసి చూపించాడు ఒకే ఒక్కడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా అధికారికంగా మొదటి రోజు ఇంత కలెక్షన్స్ రాబట్టిందో చూడాలి. వాస్తవంగా 250 కోట్ల వరకు వసూలు చేస్తుందనుకుంటే 175 కోట్లకే పరిమితం కావడం.. దారుణమని కూడా కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: