కానీ ఈ సినిమా హిట్ అవుతుంది అని మెగా ఫాన్స్ కి కూడా నమ్మకం లేదు . అది ఎందుకో కూదా అందరికి తెల్సిన విషయమే. ఆ తర్వాత వస్తున్న విశ్వంభర, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సో సో గానే మిగిలిపోతాయి. ఇక పుష్ప 2 ని మించే రేంజ్ లో హిట్ అంటే మరో మూడు - నాలుగు ఏళ్లు అయినా ఆగాల్సిందే . ఆ సినిమా మరేంటో కాదు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించబోయే సినిమా.
పుష్ప 2 సినిమాను మర్చిపోయాలా చేయాలి అన్నా.. అల్లు అర్జున్ నటనను మించిపోయే రేంజ్ లో మైమరిపించాలి అన్న.. అది రాజమౌళికే దక్కుతుంది . ఆ కారణంగానే పుష్ప2 సినిమా మరొక ఐదు ఏళ్ళు ఇండస్ట్రీలో అలాగే హీట్ పెంచేస్తూ పోతుంది అని ..ఫైనల్లీ రాజమౌళి మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితేనే పుష్ప రాజ్ గాడిని మర్చిపోతామంటూ పుష్ప 2 తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రీలో అలాంటి హిట్ అందుకోబోయే తెలుగు హీరో మా మహేష్ బాబు అని అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. చూదాం మరి ఏం జరుగుతుందో..??