టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే అల్లు అర్జున్ కొంత కాలం క్రితం తన పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. రష్మిక మందర ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే మూవీ ని రూపొందించారు. ఈ మూవీ ని నిన్న అనగా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇక కొంత మంది ఈ సినిమా అద్భుతంగా ఉంది అని అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తే మరి కొంత మంది మాత్రం పుష్ప పార్ట్ 1 తో పోలిస్తే ఈ సినిమా చాలా తగ్గింది అని పుష్ప పార్ట్ 1 లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తో పాటు కథ కూడా సాలిడ్ గా ఉంటుంది అని పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే కథ పెద్దగా లేదు.

కేవలం అల్లు అర్జున్ నటనపై సినిమా బేస్ అయ్యి ఉంది అని , కేవలం అల్లు అర్జున్ నటన తప్పితే ఏమీ లేదు అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా కథ ఇతర విషయాలు పక్కన పెడితే అల్లు అర్జున్ మాత్రం ఈ మూవీ లో తన నటనతో అదిరిపోయే స్థాయిలో ప్రేక్షకులను మెప్పించాడు అని ప్రశంసలు మాత్రం చాలా మంది జనాల నుండి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: