ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమా నిన్న అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు అనగా డిసెంబర్ 4 వ తేదీన కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ సినిమాకు ప్రీమియర్ షో ద్వారానే పర్వాలేదు అనే టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి విడుదల రోజు అనగా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా బుక్ మై షో లో అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది.

మూవీ కి సంబంధించిన టికెట్స్ ఒక గంట వ్యవధిలో బుక్ మై షో లో 100 కే సేల్ అయ్యాయి. ఇలా బుక్ మై షో ఆప్ లో పుష్ప పార్ట్ 2 మూవీ అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇకపోతే పుష్ప పార్ట్ 1 సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలోని నటనకు గాను అల్లు అర్జున్ కు  ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 సినిమాలో కూడా అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

మూవీ లోని నటనకు కూడా అల్లు అర్జున్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు 600 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ మూవీ 1000 కోట్లకు మించిన కలెక్షన్లను రాబడితేనే హిట్ స్టేటస్ను అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఎ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: