పుష్ప ది రూల్ మూవీ డైలాగ్స్ విషయంలో వైసీపీ అతి చేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే నెగిటివ్ ప్రచారం చేసేవాళ్లకు భారీ షాకిచ్చే దిశగా బన్నీ ఫ్యాన్స్ అడుగులు వేస్తున్నారు. పుష్ప ది రూల్ ఫేక్ ప్రచారానికి తమదైన శైలిలో చెక్ పెడుతున్నారు. పుష్ప ది రూల్ మూవీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పుష్ప ది రూల్ ఫస్ట్ డే కలెక్షన్లు 175 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో ఈ సినిమాకు ఏకంగా 4.2 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. పుష్ప ది రూల్ మూవీకి సంబంధించి గంటలోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని కేవలం బుక్ మై షో వెబ్ సైట్ లోనే ఈ సినిమా ఈ రికార్డును సొంతం చేసుకుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ సమయంలో ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో బన్నీతో సహా మొత్తం 12 మందిపై కేసు నమోదైందని తెలుస్తోంది. బన్నీ అతని టీం ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. ఈ వివాదం వల్ల బన్నీకి సక్సెస్ దక్కిన ఆనందం కూడా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.