టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో రాజమౌళి ఒకరు. ఇకపోతే రాజమౌళి , సుకుమార్ దర్శకత్వంపై అనేక సార్లు పొగడ్తల వర్షం కురిపించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా సుకుమార్ , అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా పుష్ప పార్ట్ 2 అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు హైదరాబాద్లో ఈ మూవీ బృందం వారు భారీ ఎత్తున ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దానికి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ ... నేను అనుకోకుండా ఒక రోజు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాను. అక్కడ అల్లు అర్జున్ , సుకుమార్ ఉన్నారు. నాతో సుకుమార్ ఒక సీన్ చూస్తారా సార్ అని అన్నాడు. చూస్తాను అన్నాను. దానితో ఆయన నాకు ఒక సీన్ పెట్టి చూపించాడు. ఆ సీన్ అదిరిపోయే రేంజ్ లో ఉంది. అది పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో ఇంట్రడక్షన్ సీన్. ఇక ఆ సీన్ చూసాక నేను సుకుమార్ తో ఈ సీన్ కి దేవి శ్రీ ప్రసాద్ తో ఏ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టిస్తావో కొట్టించు. ఇది అదిరిపోయే రేంజ్ సీన్ అవుతుంది అని సుకుమార్ కి చెప్పినట్లు రాజమౌళి అన్నాడు. ఇక రాజమౌళి ఆ సీన్ చూసి మరి ఆ స్థాయిలో ఉంది అనడంతో పుష్ప పార్ట్ 2 మూవీ లోని హీరో ఇంట్రడక్షన్ సీన్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇక పుష్ప పార్ట్ 2 సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సీన్ రాజమౌళి చెప్పిన స్థాయిలో లేదు అని ,  పర్వాలేదు అనే స్థాయిలో మాత్రమే ఉంది అనే అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి భారీ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: