అల్లు అర్జున నటించిన పుష్ప-2 గురువారం డిసెంబర్ 05 ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. అయితే చాలా చోట్ల బుధవారమే డిసెంబర్ 04 ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ పడ్డాయి.ఇక హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ లోనూ పుష్ప 2 ప్రీమియర్ షోష్ ప్రదర్శించారు. సాధారణంగానే ఈ థియేటర్‌ కు ప్రేక్షకులు భారీగా వస్తుంటారు. అలాంటిది అల్లు అర్జున్ కూడా రావడంతో థియేటర్‌ దగ్గరకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి కూడా చేయాల్సి వచ్చింది. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో జరిగన తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా రేవతి మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై రేవతి భర్త భాస్కర్ స్పందించారు.మా బాబు అల్లు అర్జున్‌కు అభిమాని. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము. అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారు. వాడి కోసమే అంతా సినిమాకు వచ్చాం.కానీ ఇలా తొక్కిసలాట జరిగి నా భార్యను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నాను. పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. అప్పటికి అభిమానులు మాములుగానే ఉన్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ వచ్చారో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగింది. తొక్కిసలాట జరిగింది. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు.అని రేవతి భర్త భాస్కర్ తెలిపారు.ఇదిలావుండగా తాజాగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటనపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. బుధవారం రాత్రి ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం పట్ల దురదృష్టకరమని తెలిపింది. ఆ కుటుంబాన్ని త్వరలోనే కలిసి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది.అలాగే సంధ్య థియేటర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: