ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నిన్న అనగా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను కొన్ని ప్రాంతాలలో డిసెంబర్ 4 వ తేదీన అర్ధరాత్రి నుండే ప్రదర్శించడం మొదలు పెట్టారు. ఈ సినిమా ప్రీమియర్ షో లకు ప్రేక్షకుల నుండి మంచి టాక్ రావడంతో ఈ మూవీ కి విడుదల తేదీనే అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే పుష్ప 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అనేక మంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంశల వర్షాన్ని కురిపిస్తున్నారు.

అందులో భాగంగా తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ కూడా పుష్ప 2 సినిమాకు సంబంధించి తన అభిప్రాయాలను తెలియజేశాడు. అట్లీ "పుష్ప 2" మూవీ గురించి స్పందిస్తూ ... అల్లు అర్జున్ సార్ పుష్ప 2 సినిమాలో మీ నటన అద్భుతం. మరో బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు మీకు    శుభాకాంక్షలు. సుకుమార్ , రష్మిక కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు అని అట్లీ తెలియజేశాడు.

ఇకపోతే గత కొంత కాలంగా అల్లు అర్జున్ , అట్లీ కాంబో లో మూవీ రూపొందే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. మరి వీరి కాంబోలో మూవీ ఉంటుందా లేదా అనేది మరి కొంత కాలంలో క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది. ఇకపోతే కొంత కాలం క్రితం అట్లీ , షారుక్ ఖాన్ హీరోగా జవాన్ అనే మూవీ ని రూపొందించి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 1999 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: