అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా నిన్న గ్రాండ్ గా విడుదలైంది. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేశారు. మొదటి నుంచి పుష్ప-2 సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులను కొల్లగొట్టాలని చూస్తూనే ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ 223 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఉంది. అనంతరం బాహుబలి 2, కల్కీ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పుష్ప-2 సినిమా ఈ రికార్డులను బ్రేక్ చేసిందని సమాచారం అందుతోంది.


మూవీ యూనిట్ అధికారికంగా ఇప్పటివరకు కలెక్షన్లను అనౌన్స్ చేయలేదు కానీ సినిమా ట్రేడర్స్ అంచనా ప్రకారం పుష్ప-2 సినిమా మొత్తంగా 280 కోట్ల నుంచి 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిందని సమాచారం అందుతుంది. అంటే మొత్తంగా 170 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప మొదటి స్థానంలో నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


అలాగే హిందీలో జవాన్, యానిమల్ సినిమాల ఓపెనింగ్ డేస్ కలెక్షన్స్ కూడా క్రాస్ చేస్తుందని అంటున్నారు. ఒక హిందీ నుంచి 90 కోట్ల కలెక్షన్లు రావచ్చని సమాచారం. కాగా, పుష్ప-2 సినిమా ముందు రోజే ప్రీమియర్ షో వేయడం వల్ల చాలామంది సినిమా చూడడానికి ఆసక్తిని చూపించారు. సంధ్యా థియేటర్లో పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రభుత్వం అప్రమత్తమైంది.


ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనౌన్స్ చేశారు. కాగా, ఈ థియేటర్లో సినిమా చూడడానికి అల్లు అర్జున్ రాగా అతడిని చూడడానికి భారీ ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరిని బాధపడేలా చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: