ప్రజెంట్ పాన్ ఇండియా బాక్సాఫీస్ చుట్టూనే ఫిలిం మేకర్స్ తమ దృష్టి సారిస్తున్నారు .. అన్ని ఇండస్ట్రీలోని అగ్రనటులను కలుపుతూ భారీ మల్టీస్టారర్లు చేయడానికి ముందుకు వస్తూ పాన్ ఇండియా వ‌సూళ్ల‌ను కొల్లగొట్టాలని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే మనదేశంలో భాషా బేధం లేకుండా టోటల్ పాన్ ఇండియాని కొల్లగొట్టాలంటే ఏం చేయాలి ? అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. నిజానికి ఓ ముగ్గురు అగ్ర హీరోల కలయికతో ఇది సాధ్యమవుతుందని అంటున్నారు .. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు అంటే ? బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ , రెబల్ స్టార్ ప్రభాస్ , రాకింగ్ స్టార్ యాష్ ఈ ముగ్గురు కలిస్తే పాన్‌ ఇండియా బాక్సాఫీస్ షేక్ అయిపోయే వ‌సూళ్ల‌ను సాధ్యమవుతాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ముగ్గురు కలిస్తే అది ముగ్గురు ఖాన్లు ను మించి కిక్కిస్తుందని బాక్సాఫీస్ వద్ద రికార్డులో వర్షం కురుస్తుందని అంటున్నారు.


అయితే ఇప్పటికే షారుక్ ఖాన్ , యాష్ కాంబినేషన్ లో సినిమా గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కేజిఎఫ్ , కేజీఎఫ్ 2 తర్వాత చేస్తున్న టాక్సిక్ లో కీలకమైన గెస్ట్ పాత్రలో షారుక్ ఖాన్ నటిస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే కేజిఎఫ్ 3 లోను షారుక్ ఖాన్ విలన్ గా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేయగలరని అభిమానులు నమ్ముతున్నారు.. ఖాన్‌తో కలవడం వల్ల దక్షిణాది స్టార్ యాష్ కి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరింత క్రేజ్ పెరుగుతుందని అలాగే షారుక్ ఖాన్ పఠాన్ 2లో యాష్ కూడా గెస్ట్ రోల్ లో నటించేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్ లో షారుక్ ఖాన్ , యాష్ కలవడంతో ఈ ప్లానింగ్ పై మరిన్ని ఊహగానాలు మొదలయ్యాయి.


ఇక ఈ సంవత్సరం షారుక్ ఖాన్ తన కెరీర్ లోనే ఎన్నో గొప్ప విజయాలను బ్యాక్టీబ్యాక్ అందుకున్నారు . అలాగే బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేశారు. అదే స‌మ‌యంలో ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ చిత్రాల‌లో న‌టించిన య‌ష్ తో షారూఖ్ క‌ల‌యిక గొప్ప స‌హ‌కారాన్ని సూచిస్తుంద‌ని అభిమానుల్లో టాక్ వినిపిస్తోంది. అయితే షారూఖ్ - య‌ష్ క‌ల‌యిక‌తో రాజుకునే ఫీవ‌ర్ కి ప్ర‌భాస్ యాడైతే పుట్టుకొచ్చే ఫీవ‌ర్ ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. భార‌త‌దేశంలోని మూడు విభిన్న భాష‌ల నుంచి బిగ్గెస్ట్ స్టార్స్ క‌లిసి న‌టిస్తే బాక్సాఫీస్ వ‌ద్ద అన్ని రికార్డులు బ్రేక‌వ్వ‌డం ఖాయం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: