ప్రస్తుతం గ్లోబల్ రేంజ్ లో భారీ హైప్ ఉన్న సౌత్ సినిమాల్లో SSNB 29 .. ఇంకా సెట్స్‌ మీదకు కూడా వెళ్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో అప్పుడే డిస్కషన్లు మొదలయ్యాయి. అంతేకాకుండా త్వరలోనే షూటింగ్ మొదలవుతుందనే టాక్ రావడం తో ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్లుగా రాబోయే అతిథుల లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రాజమౌళి దర్శకత్వంలో ఊహించని ఓ గ్లోబల్ మూవీ ని ప్లాన్ చేసిన మహేష్ బాబు ..ఇకు ఇప్పుడు ఆ సినిమా కోసం తన మేక్ ఓవర్ మార్చుకునే పనిలో ఉన్నారు. త్రిబుల్ ఆర్ ప్రమోషన్ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న రాజమౌళి కూడా చాలా రోజులుగా మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు.


ఇక ప్రెసెంట్ SSMB 29 గా పిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్కిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది . ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఊహించని స్పీడ్ లో జరుగుతున్నాయి . ప్రస్తుతం లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఇప్పటికే హైదరాబాదులో సినిమా షూటింగ్ కోసం భారీ సెట్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్‌ షూటింగ్ అంతా ఈ స్టేట్లోనే జరుగునుంది. ఒకసారి ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయితే సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు అంతా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి పేరు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతుంది కాబట్టి మహేష్ మూవీ లాంచింగ్ కు అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట .


ఇక‌ అందుకే ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ లో అంతర్జాతీయ గెస్ట్‌లు సందడి చేయబోతున్నారని న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ సాధించిన క్రమంలో హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌, స్పీల్‌ బర్గ్ .. రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్ మహేష్ మూవీ లాంచింగ్ ఈవెంట్ కు గెస్ట్ లుగా రాబోతున్నారని న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది. ఇదే జరిగితే ఇండియన్ సినిమా రేంజ్ మరో మెట్టు ఎక్కినట్టే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: