మన భారతీయ చిత్ర‌ పరిశ్రమలో హీరోగా ఉన్నవారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రస్తుతం బాలీవుడ్ లో అమితాబచ్చన్, టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ .. ఈ ముగ్గురు ఇప్పటికీ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా వెలుగుతున్నారు. అయితే చిరంజీవి , రజినీకాంత్ ఇప్పటికీ హీరోలుగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందుకుంటున్నారు. అమితాబచ్చన్ మాత్రం హీరోగా సినిమాలుమాని క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన వయసుకు తగ్గ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.


అయితే గతంలో ఈ ముగ్గురు హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్‌కు చమటలు పట్టించారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలకు అమితాబచ్చన్ బిగ్బిగా ఎదిగారు. అలాగే తెలుగు సినిమాను కొత్త పొంతలు తొక్కించి మెగాస్టార్ గా చిరంజీవి తన క్రేజ్‌ను సొంతం చేసుకున్న‌రు .. ఆరు ప‌దుల వయసు దాటినా కూడా ఇప్పటి తరం హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇక తమిళ‌ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన రజినీకాంత్ ఇప్పటికీ ఏడు పదులు వయసు దాటుతున్న కూడా యంగ్ హీరోలను మించిపోయే రేంజ్ లో సినిమాలు చేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.


అయితే గతంలో ఈ ముగ్గురు హీరోలకు చెమటలు పట్టించింది ఓ స్టార్ హీరోయిన్. త‌న సినిమాలతో ఈ ముగ్గురిని మించిపోయే రెమ్యూనరేషన్ అందుకొని ఇండియన్ బాక్సాఫీస్ కే లేడీ  సూపర్ స్టార్ గా నిలిచింది. ఆ స్టార్ హీరోయిన్ మరి ఎవరో కాదు సీనియర్ బ్యూటీ  విజయశాంతి. ఈమె గురించి కొత్తగా పరిచయం అవసరం.. తమిళ , తెలుగు సినిమాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి చిరంజీవి నుంచి రజినీకాంత్ వరకు ఎంతో మంది హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ  సూపర్ స్టార్ గా  క్రేజ్ తెచ్చుకుంది. అదే క్రమంలో ఈమె రజనీకాంత్ , చిరంజీవిని మించిపోయే క్రేజ్‌ను తెచ్చుకుని అప్పట్లోనే కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్గా రికార్డులు క్రియేట్ చేసింది. ఇలా తన రెమ్యూనిరేషన్ తో రజినీకాంత్ , చిరంజీవిని పక్కకు తోసిన హీరోయిన్గా ఇప్పటికీ ఈమె పేరు చెబుతూ ఉంటారు .

మరింత సమాచారం తెలుసుకోండి: