టాలీవుడ్ లో శ్రీలీల చాలా తక్కువ టైంలోనే ఒక రేంజ్ లో పాపులర్ అయింది. అసలు రెండేళ్ల నుంచి వరుస పెట్టి ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. కుర్ర హీరోల నుంచి స్టార్ట్ హీరో ల వరకు వరుస పెట్టి అందర హీరోల సినిమాలలోనూ శ్రీలల నటిస్తోంది. చాలా తక్కువ టైంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా గుంటూరు కారం సినిమాలోని నటించింది. వరుసగా రవితేజ - నితిన్ - వైష్ణవ తేజ్ . . చివరకు బాలయ్య సినిమాలో వరుసకు కూతురు పాత్రలోనూ నటించింది. ఇలా ఎన్ని సినిమాలలో నటించినా ఆమెకు ఎందుకో గాని సరైన హిట్ పడటం లేదు. సరైన కమర్షియల్ హిట్ పడితే శ్రీలీలకు అస్సలు తిరుగే ఉండదు. అయితే ఈ ఏడాది శ్రీలీల దూకుడు కాస్త తగ్గింది. చదువుకుంటున్నప్పుడే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీలీల చిత్రాంగదా అనే తెలుగు సినిమాలో చిన్ననాటి శాలిని దేవిగా నటించారు. హీరోయిన్గా నటించిన తొలి సినిమాకే ఉత్తమ అవార్డు గెలుచుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
ఆ తర్వాత భరత్ అనే సినిమాలో నటించారు. అయితే ఇటీవల ఆమె నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టలేదు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న శ్రీలీ ల డ్యాన్స్ లో కూడా అదర గొడుతున్నారు. వరుసగా సినిమాలు ప్లాపులు కావడంతో శ్రీలీల ఐరన్ లెగ్ అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా పుష్ప 2 సినిమాలో కిసిక్ ఐటెం సాంగ్ తో ఆమె దేశం అంతా ఒక ఊపు ఊపుతోంది. ఈ సినిమాతో ఆమెకు వచ్చే క్రేజ్ తోనే 23 ఏళ్ల శ్రీలీల బాలీవుడ్ తో పాటు అటు తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఏదేమైనా బన్నీ సినిమా ఆమె దశనే మార్చేయనుంది.
శ్రీలీల కుటుంబం విషయానికి వస్తే ఆమె అమెరికాలోని మిచిగాన్‌లో 14 జూన్ 2001న జన్మించి ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. ఆమె వైద్య వృత్తి చదువుతున్నారు. శ్రీలీల తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్‌గా ఉన్నారు. విజయవాడ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని సుభాకర రావును వివాహం చేసుకున్న స్వర్ణలత, కొన్ని కారణాల వల్ల ఆయనకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆమెకు శ్రీలీల జన్మించింది.