టాలీవుడ్ హీరో నాగచైతన్య, బాలీవుడ్ నటి శోభిత ధూళిపాళ డిసెంబర్ మొదటి వారంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఫిదా చేస్తున్నాయి. నాగచైతన్య తన పిల్లల గురించి మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. రానా దగ్గుబాటి హోస్ట్ గా ‘ది రానా దగ్గుబాటి షో’ అనే పేరుతో అమెజాన్ ఓటీటీ టాక్ షో మొదలైన సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో శోభితతో కలిసి పాల్గొన్న నాగచైతన్య పెళ్లి గురించి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు.
శోభితతో తనకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు పుడితే చాలు అని అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరితోనే తన ప్రపంచం మొత్తం గడిచిపోతుందని వారితో చాలా సమయం గడుపుతాను అని అన్నాడు ఒకవేళ తనకు మగ బిడ్డ పుడితే అతనితో కలిసి గో కార్టింగ్ కి వెళ్తానని పేర్కొన్నాడు. కూతురు పుడితే ఆమెకు నచ్చినట్లు, ఆమె రుచులకు అనుగుణంగా తాను టైం స్పెండ్ చేస్తానని పేర్కొన్నాడు. అతను పిల్లల కనడం గురించి చేసిన వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య – శోభిత పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో చాలా వైభవంగా జరిగింది. ఈ పెళ్లి రోజున ఆడే గిఫ్ట్ గా రానా తన షో ప్రోమో విడుదల చేశాడు. రానా, నాగచైతన్య వరుసకు బావ బామ్మర్దులు అవుతారు తెలిసిందే. చిన్నప్పట్నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా జీవితాన్ని సాగిస్తున్నారు. నాగచైతన్య హాజరైన మూడో ఎపిసోడ్ శనివారం రోజు ప్రసారం కానుంది. అభిమానులు తప్పకుండా ఈ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికే ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉంటుంది. నాగచైతన్య తన మొదటి భార్య సమంత నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ నటినే పెళ్లి చేసుకున్నాడు. ఈసారి వారి పెళ్లి కలకాలం పాటు సాగాలని అభిమానులు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.