పుష్ప రాజ్ మాస్ జాతర ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున పుష్ప 2 థియేటర్స్ లోకి వచ్చేసింది. పుష్ప 2  చిత్రం బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయం సాధించింది.పుష్ప 1 కు మించి ఈ ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప 2 ఘనవిజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పుష్ప 2 తొలిరోజే భారీగా వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.ఇదిలావుండగా 80 దేశాల్లో 12 వేల స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. తెలుగు ఆడియన్స్ అయితే పుష్ప-2 కు 4.5 రేటింగ్ ఇచ్చారు. సుకుమార్ ను పొగడ్తలతో ముంచెత్తారు. పాన్ ఇండియా లెవల్లో ఇంట్రస్ట్ ఉన్నా ..నేషనల్ మీడియా అసలు పుష్ప కోసం ఏం చెబుతున్నారనేది చూసేద్దాం. ఇండియా టుడే, ఎన్డీటీవీలు పుష్ప-2 చిత్రంపై పెదవి విరిచాయి. పుష్ప-2 చిత్రం తన బరువు కింద తానే నలిగిపోయిందని ఎన్డీటీవీ పేర్కొనగా అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూనే, ఈ చిత్రంలో కథను వెనక్కి నెట్టేశారని ఇండియా టుడే వెల్లడించింది. కాని ఎక్కడ సుకుమార్ డైరక్షన్ బాలేదని కాని ..అల్లుఅర్జున్ బాగా నటించలేదని కాని అనలేదు.

అంతేకాదు బాలీవుడ్ జనాలకు ఎక్కడ దంగల్ ను బీట్ చేస్తుందేమోననే భయం కూడా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా మాత్రం పాజిటివ్ రివ్యూ ఇచ్చింది. టైమ్స్ నౌ మీడియా సంస్థ కూడా పుష్ప-2 మామూలు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ పేర్కొంది. ది హిందూ అయితే పొగడ్త ను పొగడలేక ..బాగుందని చెబితే ఏమంటారో అనే ఇది నచ్చలేదంటు రివ్యూ ఇచ్చింది. ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత స్పీడ్ సెకండ్ పార్ట్ లో లేదని చెప్పింది. కాగా, పుష్ప-2 సినిమాపై నెలకొన్న భారీ హైప్ తో జాతీయ మీడియా సంస్థల్లో చాలా వెబ్ సైట్లు లైవ్ కవరేజీ ఇస్తున్నాయి. అయితే ఆడియన్స్ కు సినిమా నచ్చేసింది. సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. ఇదిలావుండగా పుష్ప ది రూల్ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ సైతం మరీ అద్భుతంగా అయితే లేదు.పుష్ప ది ర్యాంపేజ్ థియేటర్లలోకి రావడానికి మరో 5 సంవత్సరాల సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సుకుమార్ సినిమాలలో పుష్ప ది రూల్ వీక్ స్క్రిప్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుకుమార్ ఈ నెగిటివ్ కామెంట్ల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి రీషూట్లు ఎక్కువగానే చేశారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: