తెలుగు సినీ పరిశ్రమను ఇతర దేశాలకు పాకేలా చేసిన డైరెక్టర్లలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి హస్తం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడు రాజమౌళి బాటలోనే తెలుగు సినీ పరిశ్రమను ఇతర దేశాలలో కూడా విస్తరింప చేసేలా చేస్తున్న మరొక ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు.. ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్లు తెలుగు సినిమాలతో ఇతర భాషలలో కూడా ఇండస్ట్రీలలో పాన్ ఇండియా లేవల్లో షేక్ చేసేలా చేస్తున్నారు. మరి ఆ డైరెక్టర్ల గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం.


డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ రూపు రేఖలనే మార్చేసిన ఈ డైరెక్టర్ ఆ తర్వాత యానిమల్ సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్లో తన రేంజ్ చూపించారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టింది.. 2004లో ఆర్య సినిమాతో తన సినీ కెరీయర్ని మొదలుపెట్టిన సుకుమార్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలను తెరకెక్కించి పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించారు.. ఇప్పుడు పుష్ప-2 చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్లలో స్థానాన్ని సంపాదించుకున్నారు సుకుమార్.


ఇలా S.S.Rajamouli, sandeep Reddy vanga, Sukumar..S.S.S ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్లు సైతం పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు సినిమా పరిశ్రమను శాసిస్తూ ఇతర భాషలలో కూడా డైరెక్టర్లను షేక్ చేసేలా సినిమాలను తీస్తున్నారు. ఇప్పటికీ ఈ డైరెక్టర్ల నుంచి సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలామంది దర్శకనిర్మాతల హీరోలు కూడా తమ సినిమాలను పోస్ట్ ఫోన్ చేసుకునే స్థాయికి ఎదిగారు.. ఇలా తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగేలా చేస్తున్న డైరెక్టర్లలో వీరి ముగ్గురి హస్తం కూడా ఎక్కువగా ఉన్నది.. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తీస్తూ ఉండగా.. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక సుకుమార్ తదుపరిచిత్రం ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: