ప్రస్తుతం సినిమా లవర్స్ ‘పుష్ప-2’ మేనియాతో ఊగిపోతున్నారు. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన పర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాడు. ఇక సుకుమార్ టేకింగ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలోని నటీనటులు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని ప్రేక్షకులు కితాబిస్తున్నారు.అయితే, ‘పుష్ప-2’ సినిమాను చూసిన చాలా మంది ఒక విషయంలో కాస్త నిరాశకు లోనవుతున్నారు. ‘పుష్ప-1’ మూవీలో జాలిరెడ్డి పాత్రలో డాలి ధనంజయ నటించి ఆకట్టుకున్నాడు. అయితే, ఆ సినిమాలో పుష్ప చేతిలో దెబ్బలు తిన్న జాలిరెడ్డి గాయాలతో మంచం పాలయ్యాడు. దీంతో పుష్ప-2 సినిమాలో జాలిరెడ్డి పాత్ర ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.కానీ, ఈ సినిమాలో జాలిరెడ్డి జాడ ఎక్కడా కనిపించలేదు. కేవలం క్లైమాక్స్‌లో ఓ సీన్‌లో జాలిరెడ్డి కనిపించాడు. కానీ, అతనికి ఒక్క డైలాగ్ కూడా లేదు. దీంతో జాలిరెడ్డి జాడే లేదని కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలావుండగా పుష్ప 2లో అల్లు అర్జున్ విశ్వరూప దర్శనం జరగడంతో ఫ్యాన్స్ సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి.

ముఖ్యంగా జాతర ఎపిసోడ్ గురించి పదే పదే మాట్లాడుకోవడం చూసి రెండోసారి జాతీయ అవార్డు ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు. ఇలా వరసగా రెండుసార్లు ఇస్తారా లేదానేది పక్కనపెడితే బన్నీ నిజంగా దానికి అర్హుడన్నది వాస్తవం. పుష్ప 1 ది రైజ్ లో కనిపించిన పాత్రలన్నీ ఇందులో ఉన్నాయి.కానీ ఒక్క జాలి రెడ్డి మిస్ కావడం మాత్రం ప్రేక్షకులు లోటుగా ఫీలవుతున్నారు.చివర్లో కొన్ని సెకండ్లు చూపించారు కానీ అక్కడా ఎలాంటి డైలాగు లేకుండా చిన్న ట్విస్టు ఇచ్చి ముగించారు.కథ డిమాండ్ చేయలేదా లేక కన్నడ ఫ్యాన్స్ ఇలా విలన్ వేషాలు వేయొద్దని చెప్పడం వల్లే తనే నో చెప్పాడా తెలియదు కానీ పుష్ప 2లో జాలీ రెడ్డి అంతసేపు ఎందుకు కనిపించలేదనే కారణం సుకుమార్ కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి కార్డు మాత్రం వేశారు. అల్లు అర్జున్, సుక్కు పలు సందర్భాల్లో అన్న మాటలను బట్టి చూస్తే మూడో భాగం ఇప్పట్లో జరిగే పనైతే కాదు.ఒకవేళ రెండు మూడు సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో తీస్తే అప్పుడు జాలీ రెడ్డిని తీసుకొచ్చి ఏమైనా నిడివి పెంచి ప్రాధాన్యత ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: