అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "పుష్ప : ది రూల్" ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో తెగ సందడి చేస్తోంది. పుష్ప-2 సినిమా రిలీజ్ కు ముందు నుంచి భారీ హైప్ పెంచేసింది. ప్రీ సేల్ బుకింగ్స్ లోనే తన హవాను చూపిన ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లు వసూలు చేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమా కలెక్షన్లలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.


ఇక అమెరికాలో ఈ సినిమా మొదటి రోజే సుమారు 4.2 మిలియన్ల డాలర్ల కలెక్షన్లను సాధించినట్లుగా ఓ నిర్మాణ సంస్థ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా షేర్ చేసుకుంది. అమెరికాలో ఇంత స్థాయిలో వసూళ్లు సాధించిన మూడో భారతీయ సినిమా పుష్ప-2 అనే క్యాప్షన్ ను జతచేసి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. పుష్ప : ది రూల్ మొదటి రోజు కలెక్షన్లు బాగానే ఉన్నాయి.


బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాయి. సినిమా మొదటి రోజు పాజిటివ్ సొంతం చేసుకోవడంతో రెండో రోజు అంతకుమించి కలెక్షన్లు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ రెండో రోజు ఓపెనింగ్స్ బాగా తగ్గిపోయాయని ఓ వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇది ఫ్యాన్స్ కు నిజంగా చేదు అనుభవం అని చెప్పవచ్చు. కలెక్షన్ల కోసం సుకుమార్ చాలా కష్టపడ్డాడు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన డైరెక్షన్ అద్భుతంగా ఉంటుంది.


మూడు గంటలకు పైనే ఈ సినిమా ఉంది. కానీ ట్రైలర్, టీజర్ లో భారీ హైప్ ను పెంచిన కొన్ని సీన్లు సినిమాలో తీసేసారని టాక్ వినిపిస్తోంది. మేజర్ సీన్స్ తీసేసారని, దానివల్లే రెండవ రోజు బుకింగ్స్ దారుణంగా పడిపోయాయంటూ సమాచారం అందుతుంది. ఇక మూడవ రోజు కలెక్షన్లు పెరుగుతాయో లేదో అని ప్రతి ఒక్కరూ ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: