పుష్ప-2 సినిమా విడుదలైన నేపథ్యంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది ఈ సినిమా. అంతేకాకుండా భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలవ్వడంతో ఎంతో మంది ప్రేక్షకులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని ఆరాటపడ్డారు. సినీ ప్రేక్షకుల అత్యుత్సాహం అభిమానుల తాకిడికి సంధ్య థియేటర్ వద్ద ఒక మహిళ మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఆ మహిళ కొడుకు కూడా తీవ్ర గాయాలయ్యాడు. ప్రస్తుతం ఆ బాబు చికిత్స తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే  ఈ ఘటన మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

 ముంబైలో పుష్పటు సినిమా చూస్తున్న ప్రేక్షకులపై విషవాయులు స్ప్రే చేయడంతో దెబ్బకి అస్వస్థత పాలయ్యారు సినిమా చూస్తున్న ప్రేక్షకులు.. మరి ఇంతకీ విషవాయులను స్ప్రే చేసింది ఎవరో ఇప్పుడు చూద్దాం.. ప్రపంచవ్యాప్తంగా పుష్ప హవా నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న ఓ థియేటర్లో గురువారం రాత్రి సెకండ్ షో పడ్డ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి థియేటర్లో ఘాటైన స్ప్రే కొట్టడంతో అక్కడే ఉన్న సినిమా చూసే ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. చాలామంది వాంతులు చేసుకుంటూ దగ్గుతూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి థియేటర్లో ఈ పని చేసింది ఎవరో తనిఖీ చేసి షో ఆపేశారు. ఇక తనిఖీ చేశాక 20 నిమిషాలకు మళ్ళీ సినిమాని యధావిధిగా స్టార్ట్ చేశారు. అలా గుర్తుతెలియని వ్యక్తి చేసిన పనికి సినిమా చూసిన ప్రేక్షకులు అస్వస్థకు గురయ్యారు. అయితే ఈ పని ఎవరు చేసారో తెలియడం కోసం పోలీసులు అందర్నీ చెక్ చేసినప్పటికీ ఆ వ్యక్తి మాత్రం దొరకలేదు.ఇంటర్వెల్ తర్వాత లోపలికి వచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘాటైనా స్ప్రే ని కొట్టడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు

మరింత సమాచారం తెలుసుకోండి: