టాలీవుడ్ టాప్ హీరోలలో బాలకృష్ణ ఒకరు. 50 ఏళ్ల నట జీవితంలో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను సొంతం చేసుకుని ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. బాలకృష్ణ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్నాడు. బాలకృష్ణ సినిమా అంటే చాలు థియేటర్ల ముందు పండగ వాతావరణం నెలకొంటుంది. బాలయ్య బాబు అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. బాలయ్య బాబు పవర్ ఫుల్ డైలాగ్స్, ఫైట్ సీన్లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
కాగా, కథ ఉంటే కాకినాడ పోర్ట్ మాఫియా పైన సినిమా చేస్తానంటూ నందమూరి బాలకృష్ణ తాజాగా అనౌన్స్ చేశాడు. కాకినాడలో ప్రముఖ జువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా తీస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా.... మీరు కథ సిద్ధం చేస్తే చేస్తా అంటూ బాలకృష్ణ సమాధానం చెప్పాడు.
మోక్షజ్ఞ కథ నాయకుడిగా ఆదిత్య 999 కు మీరు దర్శకత్వం వహిస్తారా అని మరొకరు ప్రశ్నించగా.... ఆదిత్య 369 సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఉన్నారు కదా అంటూ బాలకృష్ణ ఒక్కసారిగా నవ్వేశాడు. దీంతో బాలకృష్ణ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఇటీవల కాలంలో.. కాకినాడ పోర్ట్ మాఫియా పైన తెలుగు దేశం కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి.. అక్రమ తరలిస్తున్న బియ్యం ముఠా గుట్టు రట్టు చేశారు.