- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్నాడు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెర‌కె క్కించిన తీరుకు ప్రేక్షకులు థియేటర్లలో నిరాజనాలు పలుకుతున్నారు. ఈ సినిమా ప్రీ సేల్స్ తోనే ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేయడం విశేషం. ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో లో పుష్ప 2 ఏకంగా మూడు మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఇండియన్ సినిమాలలో ఆల్ టైం రికార్డు అని బుక్ మై షో అధికారికంగా వెల్లడించింది. ఏది ఏమైనా.. పుష్ప 2 సినిమా దెబ్బకు రికార్డులు వ‌రుస‌గా బ్రేక్‌ అవుతున్నాయని. . బుక్ మై షో సంస్థ స్వయంగా పేర్కొనటం విశేషం.


మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ పై అటు సుకుమార్ రైటింగ్స్ సంస్త‌లు సంయుక్తంగా క‌లిసి ఈ సినిమా ను రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా కు రిలీజ్ కు ముందే రు. 1065 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇక తొలి రోజే పుష్ప 2 సినిమా కు ప్రంప‌చ వ్యాప్తంగా రు. 180 కోట్ల రేంజ్ లో వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్టు ట్రేడ్ టాక్‌. అటు ఓవ‌ర్సీస్ లో అయితే ఈ సినిమాకు తొలి రోజు 4.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు వ‌చ్చాయి.  ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరు లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక సోమ‌వారం వ‌ర‌కు పుష్ప 2కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అడ్డే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: