చిత్ర పరిశ్ర‌మ‌లో కొంతమంది హీరోలకు తెలిసో , తెలియకో ఓ ఇమేజ్ వచ్చేస్తుంది .. దుల్కర్ సల్మాన్ కి కూడా తెలుగు లో అలాంటి ఇమేజ్ ఇప్పుడు వచ్చింది . ఆయన సినిమాల్లో ఏ హీరోయిన్ నటించినా వారు ఉహించని క్రేజ్‌ తెచ్చుకుంటున్నారని .. అంత స్కోప్ ఆయన ఇస్తున్నారని .. మహానటి నుంచి లక్కీ భాస్కర్ వరకు అదే కంటిన్యూ చేస్తున్నారని అంటున్నారు .. ఇక ఇప్పుడు ఈ క్రేజ్ ని త్వరలోనే పూజా హెగ్డే కూడా దక్కించుకోబోతుందా అంటే అవున‌నే అంటున్నారు .


మహానటి మూవీ సావిత్రి బయోపిక్ అయిన కీర్తి సురేష్ ఎంతో హైలెట్ అయింది .. అమ్మాడి అమ్మాడి అంటూ ఫుల్ క్రెడిట్ కొట్టేసాడు దుల్కర్ సల్మాన్ .  ఆయన పక్కన నటిస్తుంటే హీరోయిన్లు స్క్రీన్ మీద మరింత గ్లోరిఫై అవుతున్నారని ఇండస్ట్రీ లో ఉన్న వారి మాట . సీతారామం లో మృణాల్ ఠాకుర్ కి కూడా అంతే స్క్రీన్ స్పేస్ వచ్చింది . అంతేకాకుండా సీతారామం జంట ని మళ్లీ మళ్లీ వెండి తేర‌ మీద చూడాలని కోరుకున్న వారు కోట్లలో ఉన్నారు . అంత గా తమ నటన తో మెప్పించింది దుల్కర్ , మృణాల్ కెమిస్ట్రీ .. ఇక రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ లోను మీనాక్షి చౌదరి కి కూడా అలాంటి క్రేజ్‌ ఇచ్చాడు దుల్కర్ . ఈ సినిమాలో ఇద్దరూ భార్యాభర్తలు గా నటించారు .. ప్రతి సన్నివేశం లో ఒకరిని మించి మరొకరు నేచురల్ గా అదరగొట్టారు .


ఇక ఇప్పుడు త్వరలో నే ఈ లక్కీ ఛాన్స్ పూజ హెగ్డే కి రాబోతుందని ఫిలిం సర్కిల్స్ లో ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు దూల్కర్ ఓకే చెప్పారట అందులో పూజ హెగ్డే హీరోయిన్గా కన్ఫర్మ్ చేయబోతున్నారట. ఇదే జరిగితే చాలా ఏళ్లుగా తెలుగులో రియంట్రీ కి ట్రై చేస్తున్న పూజ హెగ్డే కి లక్కీ ఛాన్స్ అవుతుందంటూ ఆనందపడుతున్నారు ఫాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: