ఒక తెలుగు సినిమా అందులోనూ సీక్వెల్ సినిమా ఏకంగా 80 దేశాల్లో 12,500 స్క్రీన్ లపై రిలీజ్ అవుతుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి అసాధ్యాన్ని సాధ్యం చేసింది మన తెలుగు సినిమా .. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది .. సినిమాలో దమ్ముంటే ఎవరైనా చూస్తారు .. కచ్చితంగా ప్రేక్షకులు వస్తారన్న నమ్మకంతో తెరకెక్కించారు అంటేనే అర్థం పోవడం లేదు . దుమ్ము రేపుతున్న మన సినిమా దమ్ము ఏంటో .. ఎప్పుడు రిలీజ్ అవుతుందని దేశ విదేశాల ప్రేక్షకులు ఎదురుచూసేలా చేయటంలోనూ తెలుసుకోవడం లేదు మన తెలుగు సినిమా ఎంత ఎత్తుకు వెళ్ళిందో.
ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప 2 తొలిరోజే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డు ఇప్పటిదాకా త్రిబుల్ ఆర్ పేరిట ఉండగా ఇప్పుడు పుష్ప2 దాన్ని క్రాస్ చేసింది. కలెక్షన్లతో పుష్ప 2 అతిపెద్ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీ గా రికార్డులు క్రియేట్ చేస్తుంది. డే వన్ నుంచి పుష్ప 2 మీద ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు అల్లు అర్జున్. ప్రీరిలీజ్ బిజినెస్‌లో కూడా ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది పుష్ప 2 . ఇదే నిజమైతే ఫ్యాన్ చెబుతున్నట్లు టోటల్ కలెక్షన్స్ 2వేలకోట్లు దాటినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదేమో. మనం టాప్‌లో ఉన్నప్పుడు ఈగోలకు పోకూడదు. పుష్ప 2 లో విజిల్స్ కొట్టించుకునే హీరో డైలాగుల్లో ఇదికూడా ఒకటి . అందుకే పుష్ప 2 ప్రమోషన్ బాధ్యతల్ని కథానాయకుడే తన భుజాలకెత్తుకున్నాడు . మాస్ హీరో గా ఈ సినిమాతో మరింత ఎలివేట్ కావడమే కాదు .. తెలుగు సినిమాని ఎవరూ అందుకోలేనంత ఎత్తున కూర్చోబెట్టారు .