అయితే గతంలో నాగబాబు కూడా ఇండైరెక్టుగా అల్లు అర్జున్ ని ఉద్దేశించే ట్విట్లు చేసేవారని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.. అయితే అప్పుడు మెగా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా తాము అల్లు అర్జున్ ని ఎప్పుడు కూడా ఎలాంటి విషయాలలో దూరం పెట్టలేదని మెగా వార్, అల్లువార్ జరుగుతోందనే విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు.. దీంతో ఈ రూమర్స్ సైతం భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ తప్పు వల్లె ఒక్కసారిగా అల్లు అర్జున్ కి అనుకూలంగా మారిపోయింది.. అల్లు ఫాన్స్ కూడా యూట్యూబ్ ఛానల్స్ లలో పలు రకాల ఇంటర్వ్యూలలో కూడా తమకు మేమున్నామనే విధంగా సపోర్టుతో మాట్లాడారు.
అల్లు- మెగా కుటుంబం మధ్య విభేదాలు ఉన్న విషయాన్ని ఈ రెండు కుటుంబాలు ఖండించకపోవడంతో ఇది కొన్ని రాజకీయ పార్టీల వల్ల కూడా మరింత వైరల్ గా మారింది.. మరి జనసేన నేతలు కూడా ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నామని రచ్చ చేశారు..వైసిపి నేతలు డైరెక్టుగానే చెప్పేస్తున్నారు అల్లు అర్జున్ ఆరోజు మాకోసం వచ్చారు కాబట్టి ఈరోజు ఈ సినిమా హిట్ అవ్వాలని అలాగే తమ కార్యకర్తలు, వైసిపి అభిమానులు కూడా సపోర్టు చేస్తే సోషల్ మీడియాలో రచ్చ చేశారు..