ఇక తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప 2 రెండో రోజు కొంత మేరకు కలెక్షన్లో తగ్గుదల కనిపిస్తుంది . అయితే నార్త్ లో మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది . తెలుగు బుకింగ్స్ లో మార్పు కనబడుతుంది . తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర తన సత్త చూపటం ఆశ్చర్యం లేదు కానీ రెండో రోజు అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ డ్రాప్ కనిపించడం ఆశ్చర్యంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి . ఇక నార్త్‌లో రెండో రోజు 60 శాతం అడ్వాన్స్ బుకింగ్‌లు కనిపించాయి అంటే రెండో రోజు కచ్చితంగా 50 కోట్లకు పైగా నికర కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు .
అలాగే సౌత్ కు వచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు అడ్వాన్సుల్లో కేవలం మూడో వంతు మాత్రమే ఉన్నాయి .. అందుకు కారణం టిక్కెట్ రేట్లు .. మెగా అభిమానుల ఊహించిని బ్యాన్ కారణమని కూడా అంటున్నారు . ఈ రెండు కాకుంటే రేపు రేపు శని.. ఆదివారాలు వీకెండ్ కావడం తో అప్పటికి చాలా మంది ప్లాన్ చేసుకోవడం కూడా ఈరోజు కలెక్షన్లు తగ్గటానికి కారణమని మరి కొందరు అంటున్నారు .