హీరో జీపుపై తిరగడం, గుట్కా వేసుకోవడం, డ్రెస్సింగ్ స్టైల్ కూడా నార్త్ ప్రేక్షకుల కోసమే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే టికెట్ రేట్లు భారీగా ఉండటంతో పుష్ప ది రూల్ సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప ది రూల్ సినిమాకు ఏకంగా 700 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు అయిందని సమాచారం అందుతుండటం గమనార్హం.
నార్త్ లో పుష్ప ది రూల్ మూవీకి డిమాండ్ ఊహించని స్థాయిలో నెలకొందని ఒక్కో టికెట్ ఏకంగా 1500 రూపాయల వరకు పలుకుతోందని తెలుస్తోంది. అక్కడ మిడ్ నైట్ షోలకు కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమా బెనిఫిట్ షోలకు మాత్రం పూర్తిస్థాయిలో ఆక్యుపెన్సీ కనిపించలేదని తెలుస్తోంది. పలు చోట్ల బెనిఫిట్ షోలు క్యాన్సిల్ అయ్యాయని భోగట్టా.
తాము పెట్టిన టికెట్ రేటుకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని కొంతమంది అభిమానులు వాపోతున్నారు. పుష్ప ది రూల్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. పుష్ప2 ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. పుష్ప ది రూల్ ఫస్ట్ డే కలెక్షన్లు 281 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.