మలయాళ నటి హనీ రోజ్ తన రాబోయే సినిమా ‘రాచెల్’ జనవరి 10న విడుదల అవుతుందని తాజాగా ప్రకటించింది. ఈమె సంక్రాంతి బరిలోకి దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు ఆనందిని బాలా డైరెక్ట్ చేస్తున్నాడు. దర్శకుడు అబ్రిడ్ షైన్, కవి రాహుల్ మనప్పట్ కలిసి కథను రాశారు. రాహుల్ మనప్పట్ కథను రాయడమే కాకుండా ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించి, హనీ రోజ్ ఒక కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, "మీ ప్రేమ, మద్దతు, ప్రోత్సాహం నాకు చాలా ముఖ్యం" అని రాశారు.

హనీ రోజ్ ‘రాచెల్’ సినిమా నుంచి జూన్ 16న తన పాత్ర పోస్టర్‌ను విడుదల చేసి, సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. జూన్ 17న సాయంత్రం 5 గంటలకు సినిమా టీజర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ టీజర్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవుతుందని తెలిపారు. పోస్టర్‌లో హనీ రోజ్ రక్తంతో నిండిన ముఖంతో భయంకరంగా కనిపించారు. టీజర్‌లో హనీ రోజ్ తనను వెంటాడుతున్న రెండు ఎర్రటి కళ్ల గురించి చెబుతుంది. మరొక స్త్రీ ఆమె ఎవరో తెలుసా అని అడగ్గా, హనీ రోజ్ తనకు తెలియదని, కానీ వారిని కనుగొని చంపాలని అంటుంది. టీజర్‌లో హింసాత్మక దృశ్యాలు ఉన్నాయి. చివరగా, బాబురాజ్ చేతిలో ఆయుధంతో ఉన్న దృశ్యం చూపించారు. రక్తంతో నిండిన ముఖంతో హనీ రోజ్ షాక్‌తో కళ్ళు తెరుస్తుంది.

‘రేచెల్’ సినిమాను అబ్రిడ్ షైన్, బదుషా ఎన్.ఎం, షినాయ్ మాథ్యూ కలిసి ఈ సినిమాను నిర్మించారు. బదుషా ప్రొడక్షన్స్, పెన్ అండ్ పేపర్ క్రియేషన్స్ బ్యానర్‌లపై ఈ సినిమా తెరకెక్కింది. జూప్ ఫిలిప్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, మనోజ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా వస్తున్న "గేమ్ ఛేంజర్" 2025, జనవరి 10 థియేటర్లలో విడుదల కానుంది. నందమూరి బాలకృష్ణ చిత్రం "డాకు మహారాజ్" కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ సినిమా "సంక్రాంతికి వస్తున్నాం" జనవరి 14, 2025న థియేటర్లలో విడుదల కానుంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వీరందరితో కూడా ఈ ముద్దుగుమ్మ తన సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. అది పెద్ద సాహసమే అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: