అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ పుష్ప 2 మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ బన్నీ ఫ్యాన్స్ చెప్పుకుంటున్న ఈ సినిమాలో ఇప్పుడు కొన్ని డైలాగ్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమాలో సందర్భాన్ని వచ్చే డైలాగ్స్ ను అతని ఫ్యాన్స్ మాత్రం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినవిగా చెప్పుకుంటుండటం గమనార్హం.అయితే మూవీలోని కొన్ని డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నుంచి మెగా ఫ్యామిలీతో దూరం పెరిగిన నేపథ్యంలో ఆ డైలాగులన్నీ వాళ్లను ఉద్దేశించి ఉన్నవే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు లేని డైలాగులను కూడా మరికొందరు తెరపైకి తీసుకొస్తున్నారు.

సినిమా మొదట్లోనే మీ బాస్ కే నేను బాస్ అంటూ పుష్ప ఓ డైలాగ్ చెబుతాడు. దీనికి సోషల్ మీడియాలో ఇంకాస్త జోడించి.. "ఎవడ్రా బాస్.. ఎవడికిరా బాస్.. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్" అని అన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు. నిజానికి చాలా వరకు డైలాగ్స్ మూవీలో సందర్భానుసారంగానే వచ్చినా.. బయట ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని మలచుకుంటున్నారు.పైన చెప్పిన డైలాగ్ ఒక్కటే కాదు.. మరికొన్ని డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. మనం టాప్ లో ఉన్నప్పుడు ఈగోలకు పోకూడదు అనే డైలాగ్ కూడా అందులో ఒకటి.దీంతో మరోసారి బన్నీ వాటిని గుర్తు చేస్తూ ఇచ్చిన కౌంటర్ అని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఒకడు ఎదుగుతుంటే చాలా మందికి నచ్చదు.. వాడి డౌన్ ను చూడాలని కోరుకుంటారన్న డైలాగ్ కూడా అలాంటిదే. పరోక్షంగా తన డౌన్‌ఫాల్ ను ఓ వర్గం కోరుకుంటోందని అతడు చెప్పకనే చెప్పినట్లు ఆపాదిస్తున్నారు.ఇదిలావుండగా పుష్ప 2డైలాగ్స్ పై జనసేన నేత కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు రామలింగయ్య, మెగాస్టార్ కుటుంబాలు రెండు కాదు ఒక్కటేనని ఏపీ జనసేన నేత బొల్లిశెట్టి సత్యనారాయణ చెప్పారు. వాళ్ళు స్వయంకృషి తో ఎదిగారు తప్ప కుటుంబం పేరు వాడుకోలేదన్నారు.ఇప్పుడు పుష్ప 2సినిమా లో అల్లు అర్జున్ డైలాగులకు పెడార్ధాలు తీసి అభిమానుల్లో అగ్గిరాజేసే పనిలో వైసిపి శ్రేణులు, పెయిడ్ ఎనలిస్టులు ఉన్నారని ఆరోపించారు.సినిమాను సినిమాగానే చూడాలని, వారి ట్రాప్ లో పడొద్దని సూచించారు.ఇదిలావుండగా మూవీలోని డైలాగ్స్ మాత్రం అనుకోకుండా ఇలా రచ్చ చేస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే.. నటన పరంగా అల్లు అర్జున్ కు ఈ మూవీ మరో మైలురాయిగా నిలుస్తుందని మాత్రం మరికొందరు స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: