సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న  క్రేజ్ , ఇమేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు అసలు పాన్ ఇండియా మూవీ చేయకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవటం విశేషం. సీనియర్ హీరో కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.అలాగే మహేష్ కథల ఎంపిక కూడా బాగుంటుంది. తన ఇమేజ్ కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటారు. బోయపాటి శ్రీను వంటి దర్శకులు వచ్చినా మొహమాటం లేకుండా ఆ యాక్షన్ కథలు తనకు సరిపడవని ప్రక్కన పెట్టేసారు. ఫ్యామిలీలకు నచ్చి, కుర్రాళ్లకు ఎక్కే కథలు మహేష్ కు ఇష్టం. అందుకే  మహేష్ కెరీర్ లో ఎన్నో గుర్తుపెట్టుకోదగ్గ, అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. డిఫరెంట్ కథలతో.. వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించాడు. అలరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే శంకర్ మహేష్ బాబుతో  ఓ సినిమా కోసం చర్చలు జరిపారట. శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు చిత్రానికి ముందుగా లీడ్ రోల్ లో నటింపజేయడానికి మహేష్ బాబుని సంప్రదించారట.బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన త్రీ ఇడియట్స్ చిత్రంలో అమీర్ ఖాన్ పాత్రలో నటించడానికి చర్చ జరగగా, ఈ పాత్ర తనకు సెట్ కాదని నో చెప్పాను అని ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు చెప్పుకొచ్చాడు. ఆ పాత్ర తనకు సరిపోదనే మహేష్ ఆ మూవీని రిజెక్ట్ చేశారట. అయితే శంకర్‌, మహేష్ ల కాంబినేషన్‌లో మళ్లీ ఏదైనా మూవీ వస్తుందేమో చూడాలి.ఇక శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. Rc15 శంకర్ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా కీయారా అద్వానీ నటిస్తోంది. ఈ చిత్రం దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న 50వ చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: