సామ్ సిఎస్ తెలపడంతో ఫ్యాన్స్ మధ్య తీవ్ర మైన చర్చకు కొనసాగుతుంది. వస్తహవానికి సినిమా విడుదలకు రెండు వారాల నుంచే హాట్ టాపిక్ గా మారడంతో ఈ అంశంలోకి తమన్ పేరు రావడం, నేను ఫస్టాఫ్ కు పని చేశానని తను ఒక ఈవెంట్లో చెప్పడం రకరకాల ప్రశ్నలు వచ్చాయి . కానీ చివరికి ఫైనల్ గా దేవి, సామ్ మాత్రమే హైలైట్ అవవడం మనం చూసాం. నిజానికి పాటలు వేర్వేరుగా కంపోజ్ చేస్తే ఎవరు ఏ సాంగ్ అనేది ఇట్టే ఈజీగా గుర్తుపట్టొచ్చు. కానీ బిజిఎం ను అలా కనుకోవడం కష్టమే అని చెప్పాలి.
ఇక మరొక వైపు ఈ విషయం పై సామ్ సిఎస్ ,మాటలు చుస్తే.. . “నేను మాములుగా ఏ సినిమాకైనా పని చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ మొత్తం చదువుతాను. కానీ పుష్ప 2 రేర్ కేసు. అలా కుదరలేదు. ఎందుకంటే ఎడిటింగ్ అయ్యాక నేను చేరాల్సి వచ్చింది. ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో చాలా పని ఒత్తిడి ఉంటుంది. నేను మొత్తం మూవీకి పని చేశాను. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం కొంత అలాగే ఉంచినప్పటికీ క్లైమాక్స్ తో సహా 90 శాతం నేను కంపోజ్ చేసిందే. నిర్మాణ సంస్థ త్వరగా పనులు పూర్తి చేసే ఉద్దేశంతో నన్ను తీసుకుంది. ఒక ప్రేక్షకుడిగా నేను ఇందులో భాగమై నా వంతుగా పుష్ప 2కి శాయశక్తులా బెస్ట్ ఇవ్వడానికి కష్టపడ్డాను.” అని తెలియచేసాడు..
ఇక ఈ విషయంపై దేవి శ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తాడనేది ఒక తంతు అయితే కిరణ్ అబ్బవరం ‘క’ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సామ్ ఇప్పుడు పుష్ప 2కి వస్తున్న స్పందనలోనూ అంతే భాగం తీసుకుంటాడు అనేది మరో క విషయం. ఇక మరొక వైపు దర్శకుడు సుకుమార్, నిర్మాతల వైపు నుంచి ఎక్కడా కూడా అతని గురించి ఎటువంటి ప్రస్తావన మాత్రం రాలేదు. ఇప్పటి వరుకు కేవలం దేవిశ్రీ ప్రసాద్ గురించే మాట్లాడారు తప్ప సామ్ సిఎస్ ఇంత ఎక్కువ పని చేసింది మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. మొతానికి ఈ యువ సంగీత దర్శకుడికి ఇప్పుడు మంచిగా ఆఫర్లు వస్తునట్టు సమాచారం.