ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పేరు మార్మోగిపోతోంది. ఆయన మ్యూజిక్ కొట్టిన రీసెంట్ సినిమా "పుష్ప 2" సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా, శ్రీలీల నటించిన "కిస్సిక్" అనే పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఈ పాట ఎలా ట్యూన్ దేవిశ్రీ ఎలా పట్టాడా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి దర్శకుడు సుకుమార్, "కిస్సిక్" అనే పదాన్ని కథలోనే ఉపయోగించారు. ఈ పదం దేవి శ్రీ ప్రసాద్‌కి చాలా బాగా నచ్చింది. అందుకే ఆ పాటే మొదటి నుంచి "కిస్సిక్" అనే పదంతోనే మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

తన మ్యూజిక్ టీంతో కలిసి ఈ పాటకు ఓ చక్కటి ట్యూన్ కూడా రెడీ చేశారు. అంతేకాదు, "పీలింగ్స్" అనే మరో పాట కూడా సినిమా కథ నుంచే స్ఫూర్తి పొందిందని దేవి శ్రీ ప్రసాద్ చెప్పారు. రీసెంట్ గా ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తన సంగీతాన్ని ఎలా సృష్టిస్తారో వివరించారు. ఆయన ఒక పాటను రెండు, మూడు రకాలుగా చేయడం అనేది తన పద్ధతి కాదని చెప్పారు. తనతో పాటు ఇతరుల టోన్స్ ఎవర్ ఇవి కూడా తాను కాపీ కొట్టిన అని స్పష్టం చేశారు. "ఎక్కువగా నేను మొదటి ప్రయత్నంలోనే పాటను తయారు చేస్తాను, అదే అందరికీ నచ్చుతుంది" అని తెలిపారు.

సంగీత దర్శకుడిగా తన సూత్రాల గురించి మాట్లాడుతూ, "నేను ఎప్పుడూ ఇతరులను కాపీ కొట్టను. స్ఫూర్తి అనేది సహజంగా వస్తుంది. కానీ, ఉద్దేశపూర్వకంగా రీక్రియేట్ చేయడం అనేది కాపీ. కెరీర్ మొదట్లో నన్ను ఇంగ్లీష్ పాటలను కాపీ కొట్టమని అడిగేవారు. కానీ నేను అలా చేయలేదు. నా సొంతంగా సంగీతాన్ని సృష్టించాలని కోరుకున్నాను" అని చెప్పారు. అయితే కాపీ కొట్టానంటూ ఆయన మాట్లాడటం షాకింగ్ గా మారింది తమన్‌ను ఉద్దేశించి అతను మాట్లాడారా అని కొందరు ఆరా తీస్తున్నారు  

దేవి శ్రీ తన పనిలో నైతిక విలువలను తప్పనిసరిగా పాటిస్తానని స్పష్టం చేశారు. మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ఓ సంఘటనను ఆయన పంచుకున్నారు. "ఆ సినిమాకు మొదట వేరే సంగీత దర్శకుడిని తీసుకున్నారు. కానీ ఆయన మధ్యలో వైదొకారు. ఆ తర్వాత ఆ సినిమా కోసం నన్ను అడిగారు. కానీ నేను ఆ అవకాశాన్ని వదులుకున్నాను. ఎందుకంటే ఆ సినిమాకు ఇప్పటికే వేరొకరు సంగీతం అందిస్తున్నారు కాబట్టి. నా నిర్ణయాన్ని మహేష్ బాబు గారు చాలా అభినందించారు" అని దేవి శ్రీ ప్రసాద్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: