నటరత్న నందమూరి తారక రామారావు గురించి తెలియని వారు ఎవరు ఉండరు .. ఆయన సినీ జీవితంలోనైనా రాజకీయంలోనైనా ఆయన్ని మించిన వారు మరొకరు లేరు .. ఆయన సినిమాల విషయానికొస్తే సాంఘిక‌, జాన‌ప‌ద‌, పౌరాణిక వంటి ఇలా ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో తన అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను మెప్పించారు . ఇక సినిమా పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు అనేవి స‌ర్వసాధార‌ణ‌మ‌నే చెప్పాలి . ఎన్టీఆర్ , నాగేశ్వరరావు కాలం నుంచి ప్రేమ వ్యవహారాలు కొనసాగాయి.


ఈ క్రమంలో గతంలో ప్రేమ వ్యవహారాలు నడిపిన వారిలో సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారనే విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా సీనియర్ నటి షావుకారు జానకి ఎన్టీఆర్ ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చింది .. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ , కృష్ణకుమారీల మధ్య వ్యవహారం కంటే ముందు ఆయనకు బసవతారకంతో పెళ్లి జరిగింది .. అప్పటికే వీరికి 8 మంది కొడుకులు నలుగురు కూతుర్లు ఉన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్  , కృష్ణకుమారితో కలిసి ఎక్కువ సినిమాలో నటించారు . అదే సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. ఈ విషయంపై కృష్ణకుమారి సోదరి షావుకారు జానకి ఆ ఇంటర్వ్యూలు స్పందించారు.


ఇక షావుకారి జానకి మాట్లాడుతూ అప్పటికే వివాహం జరిగిన ఎన్టీఆర్ నా చెల్లిని పెళ్లి చేసుకోవటం అంత మంచిగా ఉండేది కాదేమో వారి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలీదు .. వారు గొడవ పడ్డారా లేక విడిపోయారా తెలియదు కానీ కెరియర్ పిక్స్ లో ఉన్న  సమయంలో కృష్ణకుమారి ఒక ఫోన్ కాల్ తో 17 సినిమాలను రద్దు చేసుకుంది. ఆ త‌రువాత ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అజ‌య్ మోహ‌న్ కైఠాన్‌ని పెళ్లి చేసుకుంది. అప్పుడు కూడా ఓ బ‌డా నిర్మాత నాకు ఫోన్ చేసి కైఠాన్ తో మీ చెల్లి ఆపండ‌ని చెప్పారు. కానీ నేను ఆ ప‌ని మాత్రం చేయ‌న‌ని చెప్పిన‌ట్టు అప్ప‌టి విష‌యాల‌ను గుర్తు చేసింది షావుకారి జాన‌కి.

మరింత సమాచారం తెలుసుకోండి: