పుష్ప సినిమాకు వచ్చిన కలెక్షన్స్ క్రేజ్ కారణంగా పుష్ప2కి ఊహించని హైప్ వచ్చిందని అనుకుంటున్నారు .. కానీ సినిమా తొలి టీజర్ కి వచ్చిన హైప్‌ ప్రధానమైన కారణమని చెప్పాలి. పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ప వచ్చినట్లు అనే డైలాగ్ తో ముగిసిన టీజర్ అందరికీ గుర్తుండే ఉంటుంది . ఆ డైలాగ్ ఏ కాదు టీజర్ మొత్తం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది . వేర్ ఇజ్‌ పుష్ప అంటూ మొదలయ్యే ఆ సీన్స్ ఇప్పుడు సినిమాల్లో ఎక్కడా లేవు . అవును పుష్పది రూల్ లో ఆ సీన్స్ ఏమీ లేవు ..


మూవీలో ఆ సీన్స్ కూడా ఉండి ఉంటే సినిమా మ‌రో లవర్ లో ఉండేది అంటూ అభిమానులు కూడా వాటి గురించి మాట్లాడుకుంటున్నారు . ఎంతో   కష్టపడి తెరకెక్కించి అంత కష్టపడి ప్రమోట్ చేసిన ఆ   సీన్స్ ఎందుకు సినిమాలో తీసేసారు అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తుంది. అయితే దీనికి రెండు ఆన్సర్లు బయటకి వచ్చాయి .. వాటిని తీసేశారని , మరొకటి దాచారని అంటున్నారు. అలాగే తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయం తో పుష్ప తప్పించుకున్నాడు అంటూ రిలీజ్ చేసిన ఆ ఆడియో విషయంలో చిన్నపాటి నెగిటివిటీ కూడా వచ్చింది. పుష్ప ఎర్రచందనం ద్వారా సంపాదించిన డబ్బులను జనాలకి పంచి   పెట్టినట్టు చూపించిన సీన్స్ వల్ల సినిమా కథ మొత్తం మారిపోతుందని కొందరు అన్నారు .


ఈ విషయం ఏమైనా చిత్ర యూనిట్ వరకు వెళ్లిందా అందుకే తీసేశార  అని కూడా కొందరు అంటున్నారు. ఇక మరికొందరు పుష్ప 2 సినిమా క్లైమాక్స్ లో బాంబు పేలిన తర్వాత పుష్ప పోలీసులకు లోగిపోతాడని అక్కడి నుంచి భార్యతో కలిసి తప్పించుకుని అడవిలోకి వెళ్లి తన ర్యాంపేజ్‌ చూపిస్తాడని కూడా అంటున్నారు. అయితే వీటిలో ఏది నిజమో తెలియదే కానీ మంచి హైప్‌ ఇచ్చే సీన్స్ అయితే మిస్‌ అయ్యాం .. నిజానికి ఆ సీన్సే కాదు జపాన్లో డీల్ చేసే సీన్ కూడాా మిస్ అయ్యాం. మరి పుష్ప 3ని ఎలా చూపిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: