ఏ భార్యకైనా సరే తన భర్త పేరు పక్కన వేరే ఒక అమ్మాయి పేరు పలికిన పిలిచిన చెరురెత్తిపోతుంది . క్లాస్ పీపుల్స్ అయితే కళ్ళతో ఉరిమి సైలెంట్ అయిపోతారు. మాస్ పీపుల్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు . కోక పైకి ఎక్కట్టి జుట్టు ముడి కట్టి ..ఏ లెగ్గుతో తనినా సరే ఆమడ దూరంలో పడాల్సిందే . అంతలా భర్తల విషయాలలో భార్యలు సీరియస్ గా ఉంటారు . అయితే ఇప్పుడు స్నేహ రెడ్డికి అలాగే మండిపోయేలా చేశారు కొందరు జనాలు. మనకు తెలిసిందే స్టైలిష్ స్టార్ బన్నీ భార్య స్నేహారెడ్డి చాలా చాలా స్ట్రిక్ట్ . తాను ఒకరి జోలికి వెళ్లదు . తన జోలికి వస్తే ఊరుకోదు . అచ్చం బన్నీ టైపే..
వీళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట . చాలా అన్యోన్యంగా ఉంటుంది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు . రీసెంట్గా సంధ్యా థియేటర్లో వీళ్ళు పుష్ప2 సినిమా చూడడానికి హాజరయ్యారు . వీళ్ళతో పాటు రష్మిక మందన్నా కూడా హాజరైంది . ఆఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ సినిమా చూడడానికి వెళ్తే ఈమెందుకు మధ్యలో పానకంలో పుడక అంటూ కొంతమందికి ట్రోల్ చేశారు. అయితే హీరోయిన్ కాబట్టి కొంతమంది అడ్జస్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా సినిమా చూసి బయటికి వస్తున్న మూమెంట్లో స్నేహ రెడ్డి ను బన్నీ ఎలా జాగ్రత్తగా చేయి పట్టుకొని కార్లో ఎక్కించాడో.. ఆ విజువల్స్ బాగా వైరల్ గా మారాయి .
అయితే సినిమాలో రష్మిక మందన్నా.. బన్నీ పెర్ఫార్మెన్స్ రొమాంటిక్ సీన్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉండే జనాలు ఓ రేంజ్ లో బన్నీకి పర్ఫెక్ట్ పెయిర్ రష్మిక అంటూ గట్టిగ అరుస్తూ వచ్చారు. దీంతో ఒక్కసారిగా స్నేహ రెడ్డి ముఖం మాడిపోయినట్లు అయింది . అయితే స్నేహారెడ్డి మాత్రం చాలా హుందాగా బిహేవ్ చేసింది. నిజానికి రష్మిక బన్నిల పర్ఫామెన్స్ అద్దిరింది. కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్ లో పండింది . కానీ అక్కడ బన్నీ రష్మిక అనడం కన్నా కూడా పుష్పరాజ్ - శ్రీవల్లి అంటేనే బాగుంటుంది . ఎందుకంటే ఇద్దరు కూడా ఆ పాత్రలో లీనమైపోయినటించారు . అందుకే అంత రొమాన్స్ పండింది అంటున్నారు జనాలు . కొంతమంది మాత్రం కావాలని స్నేహారెడ్డికి ఉడికించేలా బన్నీకి బెస్ట్ పెయిర్ రష్మిక అంటూ గట్టిగ అరవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!