లవ్ ఇన్ ఇండియా, బాహుబలి ది బిగినింగ్ వంటి ఎన్నో సినిమాలలో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది దామిని. ఇదిలా ఉండగా తాజాగా దామిని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.... తన పర్సనల్ విషయాలను వెల్లడించింది. అలాగే బిగ్ బాస్ షోలో తన అనుభవాల గురించి కూడా మాట్లాడింది. అంతేకాకుండా తనపై వచ్చిన ట్రోల్స్ గురించి చెబుతూ బాధపడింది. చాలామంది నా బాడీ పైన డ్రెస్సింగ్ స్టైల్ పైన నెగిటివ్ గా మాట్లాడారు.
దానివల్ల నాకు కాస్త బాధ అనిపించినప్పటికీ నేను వాటిని పెద్దగా పట్టించుకోనంటూ వెల్లడించారు. నా బాడీ నా ఇష్టం.... నా బట్టలు నా ఇష్టం అంటూ బాంబ్ పేల్చింది.... నేను ఇలానే ఉంటానని తెలిపింది దామిని. నేను ఎలా రెడీ అయినా కామెంట్స్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. పాజిటివిటిని నెగిటివ్ గా చూసి స్ప్రెడ్ చేసేవారు చాలా మంది ఉన్నారని దామిని వెల్లడించారు. అలాంటి వారిని, అలాంటి ట్రోల్స్ ను పట్టించుకోకపోవడమే చాలా మంచిది అని దామిని అన్నారు. నేను వాటిని అస్సలు పట్టించుకోనంటూ దామిని వెల్లడించింది. నా ఇష్టం ఉన్నట్టు రెడీ అవుతాను మీకు ఏంటి ఇబ్బంది అంటూ దామిని సమాధానం చెప్పింది.
ప్రస్తుతం దామిని చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. కాగా బిగ్ బాస్ అనంతరం తనకు మంచి క్రేజ్ వచ్చిందని ప్రేక్షకులకు చాలా చేరువ అయ్యానంటూ దామిని వెల్లడించింది. బిగ్ బాస్ షో అనంతరం ప్రతి ఒక్కరూ నన్ను గుర్తు పట్టడం ప్రారంభించారని దామిని సంతోషపడింది. కాగా దామిని ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.