నటి ఆదితి మాట్లాడుతూ.. "నా పాత్రలో పవర్ ఫుల్ స్పీచ్ లు ఇవ్వాల్సి వచ్చింది. కానీ నా వాయిస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దీన్ని గమనించిన దర్శకుడు సంజయ్ నన్ను ఒక రోజు మొత్తం ఆహారం లేకుండా ఉండమని చెప్పారు. ఆ పాత్రకు న్యాయం చేయాలి కాబట్టి నేను ఫుడ్ తినకుండా ఉన్నాను. ఆకలితో కడుపు మండి ఆ సమయంలో నేను చాలా రఫ్ గా మాట్లాడాను అంతే షాట్ ఓకే చేసేసారు. అంతేకాకుండా, ఈ సిరీస్ కోసం కథక్ అనే సాంప్రదాయం నృత్యం నేర్చుకోవడం చాలా కష్టంగా అనిపించింది. చిన్నప్పటి నుంచి నాట్యం చేస్తున్నప్పటికీ, కథక్ నృత్యం చాలా భిన్నంగా ఉంటుంది. దీన్ని సంజయ్ లీలా భన్సాలీ వంటి పర్ఫెక్షనిస్ట్ దర్శకుడి దగ్గర నేర్చుకోవడం అంటే చాలా కష్టమే. ప్రతి అడుగు, ప్రతి చేయి కదలిక సరిగ్గా ఉండాలి. లేకపోతే దర్శకుడు సంతోషించడు. ఇందుకోసం నేను రాత్రులు నిద్ర లేకుండా ప్రాక్టీస్ చేసాను" అని చెప్పింది.
‘హీరమండి’ సిరీస్‌లో మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా వంటి నటీమణులు కూడా నటించారు. ఈ సిరీస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. సంజయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ఆదితిని బలమైన ప్రసంగం చేయమంటే, ఆమె దాన్ని చాలా సున్నితమైన, ఎమోషనల్ సన్నివేశంగా మార్చేస్తుంది. పస్తులు ఉంచితే గాని దారిలోకి రాలేదు” అని వ్యాఖ్యానించారు.