కల్కి, సలార్ హిట్లతో జోష్ మీదున్న ప్రభాస్, సీతారామంతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ను యుద్ధ వీరుడిగా చూపించనున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌కు మరో కొత్త నటి పరిచయం కాబోతుంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో ప్రారంభమైన కొత్త సినిమా పూజా కార్యక్రమంలో మెరిసిన కథానాయిక ఇమాన్ ఇస్మాయిల్ గురించి సినీ అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. రష్మికా మందనా, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే తరహాలో ఈ నటి కూడా టాలీవుడ్ నుంచి మరో సంచలనం కానుందనే అంచనాలు మొదలయ్యాయి. ఈ నటి బయోగ్రఫీ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. పైగా హీరోయిన్లను అందంగా చూపించడంలో హను రాఘవపూడి మంచి ఎక్స్‌పర్ట్.ఈ నటి పేరు ఇమాన్వి. అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఈమె నటి మాత్రమే కాదు, డ్యాన్సర్.. కొరియోగ్రాఫర్ కూడా. డ్యాన్స్ అదరగొడుతుంది. ఆ డ్యాన్స్ ద్వారానే అందరి దృష్టిలో పడింది. ఈమె డ్యాన్స్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇమాన్వికి ఇన్‌స్టాగ్రామ్‌లో 7 లక్షలు, యూట్యూబ్‌లో సుమారు 5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.

ఇమాన్వి 1995 అక్టోబర్ 20న ఢిల్లీలో జన్మించింది. ఢిల్లీలోనే ఎంబీఏ, పీజీ పూర్తి చేసింది. కాలేజీ రోజుల నుంచే డ్యాన్స్‌తో బాగా పేరు సంపాదించుకుంది. ఆమె తల్లి కూడా ప్రోత్సహించడంతో ఆ దిశగా మరింత దృష్టి సారించింది. ఆ తర్వాత అమెరికాలో ఓ డ్యాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. వెస్టర్న్ డ్యాన్స్‌తో పాటు భారతీయ సంప్రదాయ భరతనాట్యం, కూచిపూడిలోనూ ఇమాన్వికి ప్రవేశం ఉంది. డ్యాన్స్‌తో పాటు ఆమె ప్రదర్శించే హావభావాలు అదనపు ఆకర్షణ.పాట నచ్చితే తనదైన శైలిలో స్టెప్పులు జోడించి రీక్రియేట్ చేయడం ఇమాన్వీ హ్యాబీ. భాష తెలియకపోయినా, పాపులర్ పాటలకు డ్యాన్స్ రీక్రియేట్‌ చేస్తుంది. అలాంటి వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక విశాల్ నటించిన ఎనిమి సినిమాలోని టం టం అనే పెళ్లి సాంగ్ కి డాన్స్ చేసి.. బాగా వైరల్ అయ్యింది.ఈ నేపథ్యంలో నే సోషల్ మీడియాలో ఆమె చేసే డ్యాన్స్, పాటకు తగినట్లుగా ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ చూసి డైరెక్టర్ హను రాఘవపూడి సైతం ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు ఏకంగా ప్రభాస్ సరసన ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెగ్యూలర్ షూటింగ్ జరుగుతుంది.ఇక ప్రభాస్ సినిమా కోసం హను రాఘవపూడి ఈమెను తీసుకున్నాడు అంటే.. కచ్చితంగా ఇందులో హీరోయిన్ పాత్ర డాన్స్ కి రిలేట్ అయ్యి ఉంటుంది అని అంతా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: