టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  చిత్రం 'వార్2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో తెలుగులో కూడా ఈ మూవీకి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఎన్టీఆర్ కూడా షూట్ లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా, వార్ 2 సినిమాను అయాన్‌ ముఖర్జీ పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ పలు షెడ్యూల్లలో పాల్గొన్నారు. ఆయనపై పలు కీలక సన్నివేశల చిత్రీకరణ పూర్తయ్యిందని టాక్. మరోవైపు హృతిక్ కూడా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటున్నారట. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ కీలక పాత్రలో నటిస్తోంది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఈ ప్రాజెక్ట్ను భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.ఇదిలావుండగా తాజాగా ఈ క్రేజీ మల్టీ స్టారర్ 'వార్ 2' గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. సినిమాకు మరిన్ని ఆకర్షణలు జోడించనున్నారట. అదేంటంటే ఈ చిత్రంలో తారక్, హృతిక్తో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో వార్ 2' సినిమా పై నార్త్ లోనే కాదు.. సౌత్ లోనూ చాలా ఆసక్తిగా ఉన్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా రికార్డుల జాతర మోగించే అవకాశం ఉంది. దీనికితోడు 'వార్ 2' సినిమాకు సంబంధించి వచ్చిన రూమర్స్ అభిమానులు ఫుల్ జోష్ ని నింపుతున్నాయి. ఐతే, వచ్చే షెడ్యూల్ లో 'వార్ 2' క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో 'ఎన్టీఆర్ - హృతిక్ రోషన్‌'లతో పాటు మరో  హీరో షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: