పుష్ప 2: ది రూల్ చిత్రంలో శ్రీలీల చేసిన కిస్సిక్ ఐటెం సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. చాలామంది ఈ సాంగ్‌ను సమంత రూత్ ప్రభు చేసిన ‘ఊ అంటవా’ సాంగ్‌తో పోలుస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘రాబిన్ హుడ్’ చిత్ర ప్రమోషన్లో శ్రీలీల పాల్గొన్నది. ఈ కిస్సిక్ సాంగ్ తాను ఎందుకు చేసిందో వివరించింది. “ఈ సాంగ్ నా నిర్ణయాన్ని సమర్థిస్తుంది. ఇది మామూలు యావరేజ్ ఐటెం నంబర్ కాదు. కథతో దీనికి బలమైన సంబంధం ఉంది. చిత్రం చూసాకే ఈ విషయం అర్థమవుతుంది” అని ఈ క్యూట్ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఆమె చెప్పినట్లే ఈ పాటకు, కథకు లింకు కలిగి ఉంది అని సినిమా చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు.

‘కిస్సిక్’ పాటకు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో శ్రీలీల చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాట పుష్ప 2 చిత్రానికి హైలైట్‌ అని చెప్పుకోవచ్చు. ఈ పాట కోసం శ్రీలీల ఎంత రెమ్యునరేషన్ తీసుకొని ఉంటుంది అనే కోణంలో కూడా చర్చలు జరిగాయి. కొన్ని వార్తల్లో శ్రీలీలకు రూ. 2 కోట్లు ఇచ్చారని, సమంత ‘ఊ అంటవా’ పాట కోసం రూ. 5 కోట్లు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందిస్తూ శ్రీలీల, “మేము నిర్మాతలతో డబ్బు విషయం ఇంకా చర్చించలేదు” అని నవ్వుతూ శ్రీలీల ఈ వార్తలను ఖండించింది.

అయితే ఇప్పుడు ఆమె గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ‘కిస్సిక్’ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించిన శ్రీలీల తన కెరీర్‌లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను ఇకపై ఐటెం సాంగ్స్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 చిత్రంపై ఉన్న హైప్‌, సమంత ‘ఊ అంటవా’ సాంగ్ సక్సెస్‌ వల్లే కిస్సీక్ సాంగ్ ఆ ముద్దుగుమ్మ చేసిందని ఇన్‌సైడర్స్ చెబుతున్నారు. ఇక శ్రీలీల నటించిన ‘రాబిన్ హుడ్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీలీల ఎలాంటి పాత్ర పోషించిందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: